VV Lakshmi Narayana: మంచి పాలన అందిస్తే.. జగన్ 11 సీట్లకే ఎందుకు పరిమితమైపోయారు? ప్రజలు ఎందుకు తిరస్కరించారు?
ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు? శాసనసభలో వారి ప్రవర్తన ఎలాగుంది? తీసుకొచ్చిన చట్టాలు ఎలాంటివి?

VV Lakshmi Narayana: 10టీవీ వీకెండ్ పాడ్ కాస్ట్ కార్యక్రమంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పలు అంశాలపై మాట్లాడారు. ఏపీ రాజకీయాలు, జగన్ పాలన, జనసేనాని పవన్ కల్యాణ్ వైఖరి, జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చేయడం.. ఇలా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ మంచి పాలన అందించి ఉంటే.. 11 సీట్లకే ఎందుకు పరిమితం అయిపోయారు? జగన్ పాలనను ప్రజలు ఎందుకు తిరస్కరించారు? ఏయే అంశాలు వైసీపీ ఓటమికి తీవ్రమైన ప్రభావం చూపాయి? ఈ అంశాలపై వీవీ లక్ష్మీనారాయణ ఏమన్నారంటే..
”పాలన మొత్తాన్ని మనం చూడకూడదు. ఏదైతే పాజిటివ్ జరిగిందో దాని గురించే మాట్లాడం. ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు? శాసనసభలో వారి ప్రవర్తన ఎలాగుంది? తీసుకొచ్చిన చట్టాలు ఎలాంటివి? ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా కాంట్రవర్సీ అయ్యింది. వాస్తవానికి ఈ యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చింది. భూమి రికార్డ్స్ అన్నీ డిజిటలైజ్ చేయాలని కేంద్రం చెప్పింది.
కానీ, ఇక్కడ ఏమైందంటే.. బౌండరీ రాళ్లు కూడా జగన్ బొమ్మతో ఉన్నాయి. పట్టాదారు పాసు బుక్ లోనూ జగన్ బొమ్మతోనే ఉన్నాయి. దీంతో మా భూములు తీసేసుకుంటారు అనే భావన ప్రజల్లో ఏర్పడింది. అది రాంగ్ ప్రచారం. అసెంబ్లీలో ప్రవర్తన, ఎమ్మెల్యేల మాట తీరు.. ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. అహంకారాన్ని ప్రజలు ఎప్పుడూ కూడా సహించరు. అసమర్థతను పట్టించుకోరు. అహంకారాన్ని ప్రజలు అస్సలు సహించరు. చట్టం చేతుల్లో ఉందని కేసులు పెట్టడం ఇవన్నీ ప్రజలు గమనించారు. మరోవైపు మూడు పార్టీలు ఒకే తాటి మీదకు వచ్చాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి” అని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశ్లేషించారు.