వారిని వదిలేది లేదు..! పోలవరం ప్రాజెక్ట్ ఫైళ్ల దగ్ధంపై ప్రభుత్వం సీరియస్..

పోలవరం భూసేకరణ ఫైల్స్ దగ్ధం వ్యవహారం కలకలం రేపుతోంది. పోలవరం భూ నిర్వాసితులకు సంబంధించిన రికార్డులన్నీ ధవళేశ్వరం వద్ద స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో భద్రపరిచారు.

Polavaram Files Burnt : పోలవరం భూసేకరణ ఆఫీసులో ఫైళ్ల దగ్ధంపై ఏపీ సర్కార్ సీరియస్ అయ్యింది. ఫైళ్లను దగ్ధం చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అవినీతిని కప్పి పుచ్చేందుకు ఇలాంటి పని చేస్తున్నారని మంత్రి నిమ్మల ఆరోపించారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులను శిక్షిస్తామన్నారు.

పోలవరం భూసేకరణ ఫైల్స్ దగ్ధం వ్యవహారం కలకలం రేపుతోంది. పోలవరం భూ నిర్వాసితులకు సంబంధించిన రికార్డులన్నీ ధవళేశ్వరం వద్ద స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో భద్రపరిచారు. పోలవరం ప్రాజెక్ట్ భూసేకరణకు సంబంధించిన లబ్దిదారుల వివరాలు, పూర్తి డేటా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో భద్రపరిచారు. అయితే, ఆఫీసులో భద్రపరిచిన కీలక ఫైల్స్ లో కొన్ని దగ్ధం కావడం కలకలం రేపుతోంది. ఆఫీస్ లో అధికారులే ఫైల్స్ కాల్చివేశారనే ఆరోపణలు ఉన్నాయి. పోలవరం లెఫ్ట్ కెనాల్ కు సంబంధించిన ఫైల్స్ గా గుర్తించారు. లబ్దిదారుల పరిహారం అక్రమాలు వెలుగులోకి వస్తాయనే ఫైల్స్ దగ్ధం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సగం కాలిపోయిన ఫైల్స్ ను దుండగులు పొదల్లో పడేశారు.

Also Read : ఏపీలో వరుస కేసులు.. ఒకరి తర్వాత ఒకరు.. నెక్ట్స్‌ లిస్ట్‌లో వచ్చే పేరు ఎవరిదో?

ట్రెండింగ్ వార్తలు