ఉద్యోగులకు షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం.. గత ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే..

గత జగన్ ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే జీపీఎస్ అమలు తేదీని ప్రకటిస్తూ శుక్రవారం రాత్రి గజిట్ నోటిఫికేషన్ ను చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం జారీ చేసింది.

CM Chandrababu Naidu

AP Guaranteed Pension Scheme : ఏపీ ప్రభుత్వం సీపీఎస్ ఉద్యోగులకు షాకిచ్చింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన గ్యారెంటీ పెన్షన్ సిస్టమ్ (జీపీఎస్) అమలుపై రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, దీనిపై ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గత జగన్ ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే జీపీఎస్ అమలు తేదీని ప్రకటిస్తూ శుక్రవారం రాత్రి చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం గజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు గత నెల 12వ తేదీన జీపీఎస్ అమలుకు అపాయింటెడ్ డేట్ నిర్ణయిస్తూ నాటి ఫైనాన్స్ స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ రావత్ జీవో జారీ చేశారు. కానీ, 20-10-2023 నుంచి జీపీఎస్ అమలులోనికి వస్తుందని రాత్రి గజిట్ నోటిఫికేషన్ ప్రభుత్వం ఇచ్చింది.

Also Read : వైసీపీకి మరో బిగ్ షాక్? టీడీపీలో చేరేందుకు ఎమ్మెల్సీల ఆసక్తి..!

2023 అక్టోబర్ లో జరిగిన సమావేశాల్లో జీపీఎస్ ను అసెంబ్లీ ఆమోదించింది. నాటి నుంచి గజిట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉన్నట్లుండి ఇప్పుడు ఇవ్వడంపై సీపీఎస్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీపీఎస్ – జీపీఎస్ విధానాలను అధ్యాయనం చేసి ఒక నిర్ణయానికి వస్తామని మ్యానిఫెస్టోలో ఏపీలోని ఎన్డీయే ప్రకటించింది. అధ్యాయనం చేయకుండా ఇప్పుడు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంపై సీపీఎస్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన గజిట్ నోటిఫికేషన్ రద్దు చేయాలని సీపీఎస్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు

Also Read : Teamindia : యువ‌రాజ్ మెరుపులు, ప‌ఠాన్ బ్ర‌ద‌ర్స్ ఊచ‌కోత‌.. పైన‌ల్‌లోకి భార‌త్‌.. సెమీస్‌లో ఆసీస్ చిత్తు..

2022 ఫిబ్రవరి 3న విజయవాడలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతృత్వంలో ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి సీపీఎస్ ను రద్దు చేస్తానని హామీ ఇచ్చినప్పటికీ.. సీపీఎస్ ను రద్దు చేయలేదు. దీంతో సీపీఎస్ రద్దు చేయాలని, పాత పెన్షన్ స్కీం (ఓపీఎస్) అమలు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన నిర్వహించాయి. దిగొచ్చిన అప్పటి ప్రభుత్వం అదే ఏడాది ఏప్రిల్ నెలలో కమిటీ వేసింది. అయితే, ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచార సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీపీఎస్, జీపీఎస్ పై పున: సమీక్షించి అమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు. కానీ, ఎలాంటి సమీక్ష లేకుండా ఉన్నట్లుండి గెజిట్ జీవో జారీ చేయడం పట్ల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

 

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు