ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. వారికి ఫ్రీగా 5జీ మొబైల్స్

యాప్‌ల వల్ల పని ఒత్తిడి అధికమైందని తెలిపారు. 5జీ నెట్‌వర్క్‌ ఉండే కొత్త మొబైల్స్ ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోంది.

5G mobile - Anganwadi workers

ఏపీలోని అంగన్‌వాడీ కార్యకర్తలకు 5జీ మొబైల్స్ ఇస్తామని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. వారికి సర్కారు ఐదేళ్ల క్రితం మొబైల్స్‌ ఇచ్చింది.

వాటిని అంగన్‌వాడీ కార్యకర్తలు వెనక్కి ఇచ్చేసి, ఆ పాత 2జీబీ ర్యామ్, 4జీ నెట్‌వర్క్‌తో ఉన్న ఫోన్లు ఇప్పుడు పనికి రావట్లేదని చెబుతున్నారు.

అలాగే, యాప్‌ల వల్ల పని ఒత్తిడి అధికమైందని తెలిపారు. 5జీ నెట్‌వర్క్‌ ఉండే కొత్త వాటిని ఇవ్వాలని అంగన్‌వాడీ కార్యకర్తలు కోరుతున్నారు. దీంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోంది.

తాజాగా, వేణుగోపాల్‌రెడ్డి అంగన్‌వాడీ సంఘాల ప్రతినిధులతో మాట్లాడుతూ.. సామాజిక భద్రత పెన్షన్లను పంపిణీ చేయడానికి అంగన్‌వాడీలను ఉపయోగించవద్దని కలెక్టర్లను ఆదేశించారు.

ఇప్పటికే రాష్ట్ర సర్కారు గ్రాట్యుటీ అమలు చేసిందని, మినీ అంగన్వాడీలకు ప్రమోషన్ ఇచ్చి మెయిన్‌ అంగన్వాడీలుగా చేసిందని చెప్పారు. ఇతర సమస్యలను కూడా పరిష్కరిస్తున్నామని అన్నారు.

Also Read: Gold Rates: బంగారం కొంటున్నారా? ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖలో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవాల్సిందే..

ఈ మేరకు సర్కారు సమస్యల పరిష్కారంపై సానుకూల నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. అంగన్‌వాడీలలో సంక్షేమ పథకాలకు అర్హులైన వారికి అన్నింటినీ అందిస్తామని తెలిపారు.

పలు జిల్లాల్లో బీఎల్వో విధుల నుంచి వారికి మినహాయింపు ఉంటుందని చెప్పారు. పోషణ ట్రాకర్‌లో రిజిస్టర్ చేసుకున్న డీటెయిల్స్‌ను మళ్లీ సంజీవని యాప్‌లో ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు.

అంగన్‌వాడీల సంఘాల ప్రతినిధులు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వేతనాలు పెంచాలని, లేదంటే ఆందోళనకు దిగుతామని అన్నారు. గ్రాట్యుటీ అమలు కోసం లేబర్ డిపార్ట్‌మెంట్ సలహా తీసుకుని మార్గదర్శకాలు తయారు చేస్తున్నారని చెప్పారని తెలిపారు.

అర్హత విషయంలో 1,810 మంది మినీ వర్కర్లకు మినహాయింపు ఇవ్వాలన్నారు. ఇండక్షన్ స్టవ్ వినియోగం కోసం ప్రతినెల రూ.500 విద్యుత్ ఛార్జీలను సర్కారు ఇస్తుందని తెలిపారు.