ఏపీలో మరో మైలురాయి : Amulతో అవగాహన ఒప్పందం

  • Publish Date - July 21, 2020 / 01:02 PM IST

రాష్ట్ర పరిశ్రమ రంగంలో మరో మైలురాయి నిలిచింది. అమూల్‌తో ఏపీ అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. 2020, జులై 21వ తేదీ మంగళవారం సీఎం జగన్‌ సమక్షంలో సంతకాలు జరిగాయి. స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, అమూల్‌ చెన్నై జోనల్‌ హెడ్‌ రాజన్‌ లు సంతకం చేసిన వారిలో ఉన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్‌.ఎస్‌.సోధి, మేనేజింగ్‌ డైరెక్టర్, గుజరాత్‌ కో–ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్, అమూల్‌
సంబల్‌ భాయ్‌ పటేల్, ఛైర్మన్, సబర్‌ కాంత డిస్ట్రిక్‌ కో–ఆపరేటివ్‌ మిల్క్‌ప్రొడ్యూసర్స్, యూనియన్‌ లిమిటెడ్‌ పాల్గొన్నారు. వీరితో సీఎం జగన్ మాట్లాడారు.

మహిళ జీవితాలను మార్చే క్రమంలో ఇదో గొప్ప అడుగు అవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. YSR Aasara, YSR Cheyutha మహిళలకు ఏడాదికి రూ. 11వేల కోట్లు, నాలుగు సంవత్సరాల పాటు వారికి ప్రభుత్వం సహాయం అందచేస్తోందన్నారు. వారి జీవితాలను మార్చేందుకు ఉపయోగపడే విధంగా చూస్తున్నామన్నారు.

అమూల్‌తో భాగస్వామ్యంతో ఈ దిశగా అడుగులు పడ్డాయని, ప్రభుత్వ సహకార డెయిరీలకు మంచి రోజులు వచ్చాయన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు గేట్‌వేగా ఏపీ రాష్ట్రం నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు సీఎం జగన్‌.

ఈ ఒప్పందంతో మహిళా పాడి రైతులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుందని, మంచి తోడ్పాటు అందిస్తుందని సీఎం జగన్ భావిస్తున్నారు. పాడి రైతులకు మంచి ధర దక్కడమే కాకుండా…వినియోగదారులకు సరసమైన ధరలకు, నాణ్యమైన పాల ఉత్పత్తులు అందుబాటులో వస్తాయని ప్రభుత్వం అనుకొంటోంది.