AP Three Capitals : 3 రాజధానులపై యూ టర్న్.. మెరుగైన బిల్లును మళ్లీ ప్రవేశపెడతామన్న సీఎం

మూడు రాజధానులపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. మెరుగైన ప్రతిపాదనలతో బిల్లును సభ ముందుకు తెస్తామని CM జగన్ చెప్పారు.

AP Three Capitals : మూడు రాజధానులపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లుపై ఏపీ ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపినట్టు తెలుస్తోంది. మూడు రాజధానులపై హైకోర్టులో విచారించిన అనంతరం బిల్లును వెనక్కు తీసుకుంటున్నగా అడ్వకేట్ జనరల్ కోర్టుకు విన్నవించారు. మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని త్రిసభ్య ధర్మాసనానికి  ఏజీ వెల్లడించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి జగన్.. సభలో ప్రసంగించారు. అంతకు ముందు బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన సభలో ప్రవేశపెట్టారు. 3 రాజధానుల ఏర్పాటు కోసం తీసుకున్న నిర్ణయం.. అందుకు గల కారణాలను సుదీర్ఘంగా వివరించారు. తర్వాత మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్.. మరింత మెరుగైన ప్రతిపాదనలతో సభ ముందుకు రాజధాని వికేంద్రీకరణ బిల్లును తీసుకువస్తామని చెప్పారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ప్రతిపాదనలు ఉండబోతున్నయన్నారు.

ట్రెండింగ్ వార్తలు