Dulipalla Petition Dismissed : టీడీపీ నేత ధూళిపాళ్ల పిటిషన్ ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు

ఏపీ హైకోర్టులో టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు చుక్కెదురైంది. రిమాండ్‌ను సవాల్‌ చేస్తూ వేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.

Ap High Court

AP High Court : ఏపీ హైకోర్టులో టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు చుక్కెదురైంది. రిమాండ్‌ను సవాల్‌ చేస్తూ వేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఏసీబీ కేసును సవాల్‌ చేస్తూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు స్వీకరించించింది. కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఏసీబీకి ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణ మే 5కు వాయిదా వేసింది.

సంగం డెయిరీ కేసులో అరెస్టైన ధూళిపాళ్ల దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. రిమాండ్ అంశంపై దాఖలైన పిటిషన్ ను కొట్టివేసింది. అనిశా కోర్టు విధించిన రిమాండ్ పై ధూళిపాళ్ల నరేంద్ర హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు పిటిషన్ ను కొట్టివేసింది.