High Court : లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ ను డిస్పోజ్ చేసిన ఏపీ హైకోర్టు.. విచారణకు సహకరించాలని ఆదేశం

లోకేష్ కు 41 ఏ నోటీస్ ఇవ్వాలని న్యాయస్థానం చెప్పింది. దీంతో 41 ఏ నోటీసు ఇస్తామని ఏజీ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు.

AP High Court (1)

High Court – Lokesh Petition : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ నేత నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు శుక్రవారం డిస్పోజ్ చేసింది. లోకేష్ విచారణకు సహకరిచాలని సూచించింది. ఏపీ హైకోర్టులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. లోకేష్ తరపు దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు.

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ కు 41 ఏ నోటీస్ ఇవ్వాలని న్యాయస్థానం చెప్పింది. దీంతో లోకేష్ కు 41 ఏ నోటీసు ఇస్తామని ఏజీ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు. తాము చట్ట ప్రకారమే నడుచుకుంటున్నామన్నారు. ఢిల్లీలో లోకేష్ కు సీఐడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని లోకేష్ ను ఆదేశించాలని కోర్టును ఏజీ కోరారు. దీంతో విచారణకు సహకరించాలని లోకేష్ ను ఆదేశించింది. ఈ మేరకు లోకేష్ ముందుస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. అరెస్ట్ ఆందోళన లేనందున లోకేశ్ ముందస్తు బెయిల్ పై విచారణ ముగించినట్టు హైకోర్టు పేర్కొంది.

మరో బెయిల్ పిటిషన్ వేసిన లోకేష్
మరోవైపు ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం నారా లోకేష్ మరో పిటిషన్ దాఖలు చేశారు. తన పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని ఉన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ పిటిషన్ మధ్యాహ్నం హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Also Read: చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ : నారా లోకేష్

16 రోజులుగా ఢిల్లీలోనే నారా లోకేశ్ 
చంద్రబాబు అరెస్ట్ తరువాత నారా లోకేశ్ ఢిల్లీకి పరిమితయ్యారు. తన కేసులు, తన తండ్రి కేసుల్లో న్యాయపోరాటం కోసం న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతూ ఢిల్లీలో ఉండిపోయారు. చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని రాష్ట్రపతి, జాతీయ మీడియా, జాతీయ పార్టీల నేతల దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా పార్లమెంట్ గాంధీ విగ్రహం, రాజ్ ఘాట్ వద్ద టీడీపీ నేతల నిరసన ప్రదర్శనల్లోనూ ఆయన పాల్గొన్నారు.

ట్రెండింగ్ వార్తలు