Nara Lokesh : చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ : నారా లోకేష్

జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేతకి జైలులో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర సాగుతోందని విమర్శించారు.  చంద్రబాబుకి జైలులో భద్రత లేదన్నారు.

Nara Lokesh : చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ : నారా లోకేష్

Nara Lokesh allegations CM Jagan

Updated On : September 21, 2023 / 12:25 PM IST

Nara Lokesh Sensational Allegations : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబును చంపేందుకే అక్రమ అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. చంద్రబాబును జైలులోనే అంతం చేసేందుకే అనే అనుమానాలు బలపడుతున్నాయని తెలిపారు. ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి బెయిల్ రాకుండా చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంద్రబాబును చంపేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు.

జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేతకి జైలులో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర సాగుతోందని విమర్శించారు.  చంద్రబాబుకి జైలులో భద్రత లేదన్నారు. విపరీతమైన దోమలు కుడుతున్నాయని చెప్పినా జైలు అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.

TDP Strategy: టీడీపీ ముందున్న ఏకైక మార్గం అదేనా.. వారిద్దరినీ ప్రజాక్షేత్రంలోకి తీసుకొస్తారా?

జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ డెంగ్యూ బారిన పడి మరణించాడని తెలిపారు. చంద్రబాబుకి ఇలాగే చేయాలని సైకో జగన్ కుతంత్రాలు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. జైలులో చంద్రబాబుకి ఏం జరిగినా జగన్ దే బాధ్యత అని హెచ్చరించారు.