Chandrabau Naidu
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఊరట దక్కింది. ఆయనకు ఇన్నర్ రింగ్ రోడ్డు, లిక్కర్, సాండ్ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.
ఆ మూడింటిలో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై సీఐడీ నమోదు చేసిన విషయం తెలిసిందే. కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేయడంతో గతంలో హైకోర్టులో వాదనలు పూర్తి చేసిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసి.. ఇవాళ తీర్పు వెల్లడించింది.
కాగా, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణంలో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ సమయంలో సీఐడీ మెమోపై చంద్రబాబు తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. నారా లోకేశ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు కేసుకు సంబంధం లేదని వారు అన్నారు.
దీంతో సీఐడీ మెమోను పరిగణనలోకి తీసుకోవద్దని వారు కోరారు. సాక్షులను లోకేశ్ ప్రభావితం చేస్తున్నారని సీఐడీ మెమోలో చెప్పారని వారు చెప్పారు. చంద్రబాబు అలా చేశారని ఎక్కడా చెప్పలేదని తెలిపారు. చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఎక్కడా ఉల్లంఘించలేదని చెప్పారు. సీఐడీ మెమోను తిరస్కరించాలని వారు కోరారు. దీంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ తీర్పు వెల్లడించింది.
Ambati Rayudu : జనసేనలోకి అంబటి రాయుడు..! గుంటూరు పార్లమెంట్ నుంచి బరిలోకి?