AP High Court : జడ్జి రామకృష్ణకు బెయిల్ మంజూరు

ఏపీ హైకోర్టు జడ్జి రామకృష్ణకు షరతులతో కూడిన బెయిల్​ను మంజూరు చేసింది. రూ.50 వేల పూచీకత్తుతో ఏపీ హైకోర్టు జడ్జి రామకృష్ణకు బెయిల్ మంజూరు చేసింది. విచారణాధికారికి సహకరించాలని ఈ సందర్భంగా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అలాగే కేసు విషయంపై మీడియాతో మాట్లాడవద్దని ఆదేశించింది.

AP High Court conditional bail for Judge Ramakrishna : జడ్జి రామకృష్ణకు షరతులతో కూడిన బెయిల్​ను హైకోర్టు మంజూరు చేసింది. రూ.50 వేల పూచీకత్తుతో ఏపీ హైకోర్టు జడ్జి రామకృష్ణకు బెయిల్ మంజూరు చేసింది. విచారణాధికారికి సహకరించాలని ఈ సందర్భంగా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అలాగే కేసు విషయంపై మీడియాతో మాట్లాడవద్దని ఆదేశించింది.

కాగా..ఏపీ ప్రభుత్వంమీద..సీఎం జగన్‌పై ప్రజల్లో ద్వేషం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై అరోపణలో చిత్తూరు జిల్లాకు చెందిన జడ్జి రామకృష్ణ ఏప్రిల్ లో అరెస్ట్ అయ్యారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపైనా..సీఎం జగన్‌పై ప్రజల్లో ద్వేషం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై రామకృష్ణను మదనపల్లెలో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిదే. చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన జయరామచంద్రయ్య ఫిర్యాదు చేయగా..రామకృష్ణపై ఐపీసీ సెక్షన్‌ 124ఏ కింద పీలేరు పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు.

జడ్జి రామకృష్ణలో కరోనా లక్షణాలు కనిపించటంతో బి. కొత్తకోట నుంచి మదనపల్లె వెళ్లి పరీక్షలు చేయించుకోవటానికి వెళుతుండగా మార్గ మధ్యలోఅడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఈక్రమంలో బెయిల్ అప్లై చేసుకోగా..పలు షరతులతో కూడా బెయిల్ ను ఏపీ హైకోర్టు దాదాపు రెండు నెలలకు బెయిల్ మంజూరు చేసింది.

ట్రెండింగ్ వార్తలు