‘స్కిల్’ కేసులో పిటిషన్.. సీఐడీ మాజీ చీఫ్ సంజయ్, మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలుకు నోటీసులు

కేసు దర్యాప్తులో ఉన్న సమయంలో మీడియా సమావేశం పెట్టడంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం..

సీఐడీ మాజీ ఛీఫ్ సంజయ్, మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. స్కిల్ స్కాం కేసులో అప్పట్లో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై సంజయ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.

కేసు దర్యాప్తులో ఉన్న సమయంలో మీడియా సమావేశం పెట్టడంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడంతో దీనిపై విచారణ జరుగుతోంది. పిల్ దాఖలు చేసిన ఎపీ యునైటెడ్ పోరం ఫర్ యునైటెడ్ క్యాంపెయిన్ అధ్యక్షుడు సత్యనారాయణ.. ‘మీడియా సమావేశం పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు’ అని అన్నారు.

ఈ పిల్‌ను పరిశీలించి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా, ఈ కేసులో తదుపరి విచారణ సెప్టెంబర్ 9కి వాయిదా పడింది. వైసీపీ హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసు ఎన్నో మలుపులు తిరిగింది. ఈ కేసులో సరైన అనుమతులు తీసుకోకుండానే చంద్రబాబుపై చర్యలు తీసుకున్నారని కూడా పలువురు వాదించారు. ఏపీ ప్రభుత్వం చంద్రబాబు విషయంలో ఎలాంటి కక్షపూరిత చర్యలు చేపట్టలేదన్నది వైసీపీ చెప్పుకొచ్చింది.

Also Read: అసమర్ధ పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు- జగన్‌పై మంత్రి పార్థసారధి ఫైర్

ట్రెండింగ్ వార్తలు