మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టు నోటీసులు..

తదుపరి విచారణను సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.

Peddireddy Ramachandra Reddy : వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. పెద్దిరెడ్డిని ఎందుకు అనర్హుడిగా ప్రకటించకూడదో తెలపాలంది.

ఎన్నికల అఫిడవిట్ లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్యపై ఉన్న 145 ఆస్తుల వివరాలను వెల్లడించలేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు పోటీ చేసిన అభ్యర్థులు అందరికీ నోటిసులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.

Also Read : ఒంగోలులో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ.. చేతులెత్తేసిన మాజీమంత్రి బాలినేని..!

ట్రెండింగ్ వార్తలు