High Court (1)
AP High Court: సినిమా టికెట్ల వివాదంపై విచారణను ఏపీ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. జీవో నెంబర్ 35ను సవాల్ చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ప్రభుత్వం డివిజన్ బెంచ్ ముందు సవాల్ చేసింది. ఈ సమయంలో వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
సినిమా టికెట్ల ధరలపై ఏపీ హైకోర్టులో విచారణ జరగగా.. జీవో 35ను సస్పెండ్ చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం స్టే కోరింది. సింగిల్ జడ్జి ఆదేశాల మేరకు థియేటర్ యజమానులు టికెట్ ధరల ప్రతిపాదనలను జాయింట్ కలెక్టర్ ముందు ఉంచాలని న్యాయస్థానం ఆదేశింది.
టికెట్ ధరలపై జేసీ నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది. కోర్టు గత ఆదేశాలకు అనుగుణంగా టికెట్ ధరల నిర్ణయంలో ప్రభుత్వ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.