Ram Gopal Varma: రాంగోపాల్ వర్మకు షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. కోర్టు ముందు కాదు.. పోలీసుల ముందు అలా చేయండి..!

రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ఆర్జీవీ పిటీషన్ వేయగా..

Ram Gopal Varma

Ram Gopal Varma: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపర్చేలా గతంలో సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల దీనిపై మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు రావాలని రాంగోపాల్ వర్మకు ఆయన నివాసానికి వెళ్లి పోలీసులు నోటీసులు అందజేశారు. అయితే, అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆర్జీవీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఆయన అభ్యర్ధనను కోర్టు తోసిపుచ్చింది.

Also Read: Ram Gopal Varma : రామ్‌గోపాల్‌కు వ‌ర్మకు నోటీసులు.. చంద్రబాబు, పవన్‌లపై అనుచిత పోస్టులు పెట్టారంటూ..

రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ఆర్జీవీ పిటీషన్ వేయగా.. ఆ పిటీషన్ పై హైకోర్టు సోమవారం ఉదయం విచారణ జరిపింది. విచారణ క్రమంలో హైకోర్టు ఆర్జీవీ అభ్యర్ధనను తోసిపుచ్చింది. అరెస్టుపై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని ఆదేశించింది. ఈ క్రమంలో పోలీసుల విచారణకు మరికొంత సమయం ఇవ్వాలని ఆర్జీవీ లాయర్ విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఉన్నత న్యాయస్థానం ఆ అభ్యర్ధన పోలీసుల ముందు చేసుకోవాలి, కోర్టు ముందు కాదని సూచించింది.