Anagani Satya Prasad
రెవెన్యూ శాఖపై అమరావతిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. అనంతరం రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ సమీక్ష గురించి వివరాలు తెలిపారు.
రెవిన్యూ శాఖను సమూల పక్షాళన చేయాలని చంద్రబాబు చెప్పారని అనగాని సత్యప్రసాద్ అన్నారు. హౌసింగ్ ఫర్ ఆల్ పేరుతో పేదలందరికి ఇళ్లు ఇస్తామని చెప్పారు. దీనిపై తాను, మంత్రులు నారాయణ, పార్థసారథితో ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
Also Read: ఖర్గే హాట్ కామెంట్స్.. పీసీసీ చీఫ్‌కు ఈనెల 30 డెడ్ లైన్..
“వచ్చే మూడేళ్లలో పేదలందరికి ఇళ్లు కట్టించి ఇస్తాం. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. ఫ్రీహోల్డ్ అంశంపై వచ్చే క్యాబినెట్ కి తుది నివేదిక అందిస్తాం. అలాగే, జగనన్న కాలనీల్లో ఇంకా 6.50 లక్షల ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి.
త్వరలో లబ్ధిదారులకు కేటాయిస్తాం. 363 హ్యాబిటేషన్ లలో 137 కోట్లతో స్మశాన వాటికలు నిర్మిస్తాం. వారసత్వ అనుమతి పత్రాలు భూమి విలువ రూ.10 లక్షల లోపు ఉంటే రూ. 100, ఆ పైన ఉంటే వెయ్యి రుపాయలతో గ్రామ సచివాలయాల్లో పొందవచ్చు.
రెవెన్యూ శాఖలో ఏఐ టెక్నాలజీని వినియోగిస్తున్నాం. వాట్సప్ గవర్నెన్స్ లో 56 రెవెన్యూ సేవలు అందిస్తున్నాం. ఇందులో భాగంగా 9 లక్షల మంది తమ సేవలు వినియోగించుకున్నారు” అని అనగాని సత్యప్రసాద్ అన్నారు.