ఖర్గే హాట్ కామెంట్స్.. పీసీసీ చీఫ్‌కు ఈనెల 30 డెడ్ లైన్..

పార్టీ పదవులు, ప్రభుత్వ పోస్టుల భర్తీకి ఖర్గే డెడ్ లైన్ పెట్టారు.

ఖర్గే హాట్ కామెంట్స్.. పీసీసీ చీఫ్‌కు ఈనెల 30 డెడ్ లైన్..

Updated On : July 4, 2025 / 5:01 PM IST

పార్టీ గురించి బహిరంగ వేదికలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హెచ్చరించారు. ఇవాళ టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ నేతృత్వంలో హైదరాబాద్‌లోని గాంధీభవన్‎లో జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఖర్గే పాల్గొని మాట్లాడారు.

ఏమైనా విభేదాలు ఉంటే మీనాక్షి నటరాజన్ దృష్టికి తేవాలని ఖర్గే అన్నారు. అందరినీ కలుపుకుపోవాలని, కొత్త, పాత అనే తేడా వద్దని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా గెలవాలని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి పార్టీ సత్తా చాటాలని చెప్పారు.

Also Read: రంపాలు తెస్తామంటే చూస్తూ ఉంటామా? సినిమా డైలాగులు సరదాగా ఉంటాయి.. కానీ..: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్

పార్టీ పదవులు, ప్రభుత్వ పోస్టుల భర్తీకి ఖర్గే డెడ్ లైన్ పెట్టారు. ఈ నెల 30 లోపు పోస్టులన్నీ భర్తీ చేయాలని ఆదేశించారు. పదవులు భర్తీ కాకుంటే పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌దే బాధ్యత అని చెప్పారు. పార్టీ కోసం బాగా పనిచేసిన వారికి పదవులు ఇవ్వాలని ఖర్గే అన్నారు. ఇన్‌చార్జి మంత్రులు బాధ్యత తీసుకుని పదవుల భర్తీ కోసం లిస్టులు పంపాలని సీఎం రేవంత్ చెప్పారు.