రంపాలు తెస్తామంటే చూస్తూ ఉంటామా? సినిమా డైలాగులు సరదాగా ఉంటాయి.. కానీ..: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
"మేమేమన్నా చొక్కాలిప్పుకుని రెడీగా ఉన్నామా? మమ్మల్ని మళ్లీ రెచ్చగొడితే.." అంటూ పవన్ కల్యాణ్..

Pawan Kalyan
ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం పట్టణంలో ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా మార్కాపురం-తర్లుపాడు రహదారి పక్కన నరసింహాపురంలో ఏర్పాటు చేసిన సభలో పవన్ మాట్లాడారు.
“వైసీపీ మళ్లీ అధికారంలోకి ఎలా వస్తుందో మేము చూస్తాం.. అధికారంలోకి వస్తే కేసులు పెడతాం, సంగతి చూస్తామని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారు. వైసీపీ అరాచకాలు ఎదుర్కునే ఇక్కడి వరకు వచ్చాం. 2 చోట్ల ఓడిన తర్వాతే ఇప్పుడు ఇక్కడ ఉన్నా గుండెల్లో దమ్ము, రక్తంలో వేడి ఉంది. మెడకాయలు కోస్తామంటే.. మేమేమన్నా చొక్కాలిప్పుకుని రెడీగా ఉన్నామా?
మమ్మల్ని మళ్లీ రెచ్చగొడితే.. ఇంకా గట్టిగా పని చేస్తాం. తప్పులు చేస్తే సరిచేయండి అంతేకానీ మీ తాటాకు చప్పుళ్లకు భయపడం. రంపాలు తెస్తామంటే చూస్తూ ఉంటామా… సినిమా డైలాగులు సరదాగా ఉంటాయి. అద్భుతమైన పాలన అందించి ఉంటే..11 సీట్లకు పడిపోయే వారు కాదు. మాది కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు..తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం. 2019-24 మధ్య ఐదేళ్లల్లో 26 వేల కోట్ల రూపాయలు ఇస్తామని మోదీ సర్కార్ చెప్పింది.
మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వని కారణంగా 4 వేల కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. ఆ వచ్చిన 4 వేల కోట్ల రూపాయలు కూడా చాలావరకు వృథా అయ్యాయి. అందుకే గతంలో జల్ జీవన్ మిషన్ ఆపేస్తున్నట్లు కేంద్రం చెప్పింది. జల్ జీవన్ మిషన్ కోసం రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నా… ఓడిపోతున్న దశలో వెలుగొండ పేరుతో గత పాలకులు శిలాఫలకం వేశారు. శిలాఫలకం ఎవరైనా వేస్తారు. పూర్తి చేయడమే అసలు కర్తవ్యం. 18 నెలల్లోనే పథకం పూర్తి చేస్తాం..
నేనే స్వయంగా పర్యవేక్షిస్తా.. ఆలయం భూములంటే… దోచుకోవడానికి రెడీ అంటారు.. అలా చేస్తే తరతరాలు లేచిపోతాయి. మార్కాపురంలో పారిశ్రామికీకరణ జరగాలి వెలుగొండ పూర్తి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఎన్నికలకు 150 కోట్లు ఖర్చు చేస్తున్నాం.. ప్రాజెక్టు కోసం 800 కోట్లు ఖర్చు చేయలేమా? ప్రజలకు ఉపయోగపడేలా పాలన చేయాలి డబ్బులు పెడితే తప్ప ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. వలసలు లేని, నీళ్లున్న ప్రకాశం జిల్లా నా లక్ష్యం.
ఇంకొక్కళ్లు వస్తారనే భయం మాకు లేదు. వాళ్లు రారని నాకు బాగా తెలుసు కూటమి గెలుపు ఒక్కరి వల్ల కాదు.. ఒకరికొకరం అందరికీ అవసరం నాకు పోరాటం చేసే శక్తి ఉంది అన్ని వేళ్లు కలిస్తేనే పిడికిలి… కూటమి అంటే పిడికిలి… ప్రజలకు న్యాయం చేయడమే కూటమిలో ప్రతి ఒక్కరి కర్తవ్యం. ప్రజలు అధికారం ఇచ్చింది కష్టపడి పని చేయడానికే. వైసీపీ నేతలు రెచ్చగొట్టేందుకు కుట్రలు చేస్తారు…మీరు ఎవరు రెచ్చిపోవద్దు. ఏ వ్యక్తితో వ్యక్తిగతంగా నాకు గొడవలు లేవు. గత ముఖ్యమంత్రితో నాకు వ్యక్తిగత విరోధం లేదు” అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.