AP JAC Amaravati employees: మేము ప్రభుత్వాన్ని ఎన్నడూ బ్లాక్ మెయిల్ చేయలేదు: ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగులు

ప్రభుత్వాన్ని తాము ఎన్నడూ బ్లాక్ మెయిల్ చేయలేదని ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం నాయకులు అన్నారు. తమకు రావాల్సిన హక్కులు మాత్రమే అడుగుతున్నామని చెప్పారు. ప్రభుత్వ పాలసీలను కూడా తాము ఇప్పుడు తప్పు పట్టలేదని అన్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామని చెప్పామని తెలిపారు.

AP JAC Amaravati employees: ప్రభుత్వాన్ని తాము ఎన్నడూ బ్లాక్ మెయిల్ చేయలేదని ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం నాయకులు అన్నారు. తమకు రావాల్సిన హక్కులు మాత్రమే అడుగుతున్నామని చెప్పారు. ప్రభుత్వ పాలసీలను కూడా తాము ఇప్పుడు తప్పు పట్టలేదని అన్నారు.

ఈ నెల 9వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామని చెప్పామని తెలిపారు. ఎన్నికల రోజు కౌంటింగ్ రోజు కూడా నల్ల బ్యాడ్జీలు ధరించామని చెప్పారు. అయితే ఓటర్లను ప్రభావితం చేశారని అనడం అర్థరహితమని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థి రవీంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని చెప్పారు.

“మీ తండ్రి వెన్నపూస గోపాల్ రెడ్డి అంటే మాకు చాలా గౌరవం ఉంది. కానీ, మీరు అన్న వ్యాఖ్యలు బాధిస్తున్నాయి. ఈ విషయాన్ని ముందే ప్రకటించాం.. జిల్లా కలెక్టర్ కు కూడా ముందే చెప్పాం. మీకు అన్యాయం జరిగిందని భావిస్తే న్యాయపరంగా వెళ్లవచ్చు. పీఆర్సీ, జీపీఎఫ్ ల విషయంలో తప్ప ఎప్పుడూ ప్రభుత్వాన్ని తప్పుబట్టలేదు. మాకు రావాల్సిన వాటిని అడుగుతున్నాం తప్ప.. ప్రభుత్వ పాలసీలను తప్పు పట్టలేదు.

రేపటి నుంచి వర్క్ టూ రూల్ పాటిస్తున్నాం. ఉదయం 10 గంటల నుంచి 5.30 గంటల వరకు మాత్రమే విధుల్లో ఉంటాం. 30వతేదీ లోపు పెండింగ్ లో ఉన్న బిల్లులు వేస్తామని చెప్పారు. ఇది ప్రభుత్వం చేస్తోంది.. దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నాం. సీఎం జగన్ పాదయాత్ర లో చెప్పిన ఏ హామీ నెరవేర్చ లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మా సమస్యలపై స్పందించాలి. మేము గొంతెమ్మ కోర్కెలు అడగడం లేదు.. హక్కులు మాత్రమే అడుగుతున్నాం” అని అన్నారు.

AP Assembly Budget Session-2023: సభలో రౌడీయిజం చేశారు: మంత్రులు రోజా, రజనీ

ట్రెండింగ్ వార్తలు