Site icon 10TV Telugu

AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ కేసు.. రాజ్ కేసిరెడ్డికి ఏడు రోజుల సిట్ కస్టడీ

Kesireddy Rajasekhar Reddy

AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏ1 కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కస్టడీకి ఇస్తూ ఏసీబీ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ఏడు రోజుల సిట్ కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. లిక్కర్ స్కామ్ కేసులో కేసిరెడ్డిని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు. కోర్టు ఏడు రోజుల కస్టడీకే పర్మిషన్ ఇచ్చింది. లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నాడు. రేపటి నుంచి వారం రోజుల పాటు అతడిని విచారించేందుకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారణ జరగనుంది.

Also Read: గంటా, విష్ణుకుమార్ రాజు మధ్య వివాదానికి కారణమేంటి? కూటమిలోనే ఉంటున్నా వీరి మధ్య విభేదాలేంటి?

మరోవైపు రాజ్ కేసిరెడ్డి పీఎ పైలా దిలీప్ చెన్నై నుంచి విదేశాలకు పరారయ్యేందుకు ప్రయత్నించారు. డిజిటల్, ఫోన్ లోకేషన్ ద్వారా దిలీప్ కదలికలపై సిట్ బృందం నిఘా పెట్టింది. చెన్నై ఎయిర్ పోర్టులో ఉన్నట్లు గుర్తించి వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు. ఈరోజు రాత్రికి అతడిని విజయవాడకు తీసుకొస్తున్నట్లు సమాచారం. లిక్కర్ స్కామ్ కు సంబంధించి రాజ్ కేసిరెడ్డి పీఎ వద్ద కీలక సమాచారం ఉన్నట్లు సిట్ బృందాలు భావిస్తున్నాయి.

 

Exit mobile version