Minister Audimulapu Suresh: కులాల మధ్య చిచ్చుపెట్టాలని చంద్రబాబు కుట్రలు .. తీరుమార్చుకోకపోతే ప్రజలే బుద్ధిచెబుతారు

ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టరీ ప్రసాద్‌పై చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, విక్టరీ ప్రసాద్ తన బాధ్యతను ఎస్పీల హక్కులకు ఎక్కడ భంగం కలగకుండా నిజాయతీగా పని చేస్తున్నారని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.

Minister Audimulapu Suresh: దళిత సామాజిక వర్గంకు వైసీపీ ప్రభుత్వానికి మధ్య తగాదా పెట్టాలని కుట్రలు చేస్తున్నారని, వైసీపీ ప్రభుత్వంపై కొందరు టార్గెటెడ్ విషం కక్కుతున్నారని ఏపీ మంత్రి ఆధిమూలపు సురేష్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీ‌పై తప్పుడు ప్రచారాలు చేసే వారందరికీ ప్రజలే బుద్ధిచెబుతారని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీల‌పై దాడుల ఘటనలు అనేకం ఉన్నాయని, ఈ విషయాన్ని నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్సే చెబుతున్నారని చెప్పారు. చంద్రబాబు మంచోడు కాదని ప్రజలకు తెలుసని, ప్రజలకి మేలు చేస్తున్న జగన్‌ను చెడ్డోడుగా చిత్రీకరించాలని కొందరు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP CM Jagan: చెడు చేసే వారికి కూడా మంచి చేసే గుణం నాకుంది

అని వర్గాల ప్రజలకు వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక ప్రయోజకరమైన విషయాలను అడ్డుకునేందుకు చంద్రబాబు కోర్టుకు పోతున్నారని అన్నారు. ఎస్సీ కులంలో ఎవరైనా పుడతారా అని వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ఇప్పటి వరకు క్షమాపణలు చెప్పలేదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ‌లో దేశంలో నాలుగో స్థానంలో నిలిపిన చంద్రబాబు‌కు ఏమాత్రం సిగ్గులేదన్నారు. దళితులకు ఏదైనా అన్యాయం జరిగింది అంటే అది చంద్రబాబు హయాంలోనేనని మంత్రి విమర్శించారు.

AP CM Jagan: ఎన్టీఆర్‪కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నాడు

ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టరీ ప్రసాద్‌పై చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, విక్టరీ ప్రసాద్ తన బాధ్యతను ఎస్పీల హక్కులకు ఎక్కడ భంగం కలగకుండా నిజాయతీగా పని చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఎంతో ప్రేమ ఆప్యాయతతో ఈ ప్రభుత్వాని దీవిస్తున్నారని, మరోసారి జగన్‌మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని చూస్తున్నారని మంత్రి చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేస్తుందని, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని, దీంతో కులాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని మంత్రి ఆరోపించారు. రాష్ట్ర ప్రజలంత గమనిస్తున్నారని, చంద్రబాబు ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలని మంత్రి ఆదిమూలపు సురేష్ హితవుపలికారు. చంద్రబాబు తనతీరు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ఆయనకు ప్రజలే బుద్ధి చెప్తారని మంత్రి హెచ్చరించారు.

ట్రెండింగ్ వార్తలు