Andhra Pradesh : పన్నులు కట్టకపోతే ఆస్తుల జప్తు చేస్తాం : మంత్రి బొత్స వార్నింగ్

పన్నులు కట్టకపోతే ఆస్తుల జప్తు చేస్తాం అంటూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

ap minister botsa satyanarayana about taxes : ఏపీ ప్రభుత్వం ప్రజలపై పన్నుల మోత మోగిస్తోంది.చెత్తకు పన్ను కట్టలేదని చెత్తను పట్టుకొచ్చి షాపుల ముందు పారేసిన ఘటనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం ప్రతీ విషయాన్ని రాద్ధాంతం చేస్తోంది. మంత్రులు సైతం ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేయటమే కాదు అశ్లీల పదజాలంతో ప్రజాప్రతినిధులు అనే మాటకు మాయని మచ్చ తెస్తున్నారు. అహంకారపూరితంగా చేసే వ్యాఖ్యలతోను..ప్రభుత్వం ఇష్టానురీతిగా విధించే పన్నులతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపుతున్నాయి.

కరెంట్‌ బిల్లు కట్టకపోతే కరెంట్‌ కట్‌ చేయడం.. ఆస్తి పన్ను కట్టకుంటే ఆస్తులు జప్తు చేయడం.. ఇలా పలు రకాల పన్నుల విషయంలో.. అధికారులు ప్రజలపై తీసుకునే చర్యలు ఏపీలో సర్వసాధారణంగా మారిపోయాయి. కానీ, చెత్త పన్ను, ఆస్తి పన్ను పేరుతో ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. ఈక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..‘పన్నలు కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తాం’అంటూ వ్యాఖ్యానించారు.

పన్నుల వసూలు పేరిట జనం పట్ల అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నారని.. చెత్త పన్ను కట్టలేదంటూ కర్నూలు జిల్లాలో దుకాణాల ముందు చెత్త వేయడం.. ఆస్తి పన్ను కట్టకుంటే ఆస్తులు జప్తు చేస్తాం అని వ్యాఖ్యానించారు.కరెంట్‌ బిల్లు వంకతో కరెంట్‌ కట్‌ చేయడం లాంటి చర్యలకు దిగుతున్నారంటూ ఆరోపిస్తున్నారు..ఈ వ్యవహారంపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ.. ఈ విధానం ఇవాళ కొత్తగా వచ్చిందా? అని ప్రశ్నించారు.

కరెంట్ బిల్లు కట్టకపోతే కరెంట్ తీసేస్తామనటం తప్పు అంటే ఎలా? అంటూ ప్రశ్నించారు.. ఆస్తుల జప్తు ఇవాళ కొత్తగా వచ్చిన అంశం కాదు..పన్నులు కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తామని చెప్పటం తప్పు అంటే ఎలా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు చేసినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? అంటూ ప్రశ్నించారు. ఆస్తులను జప్తు చేయటం మా ఉద్దేశ్యం కాదు.. పన్నులు కట్టకపోతే స్థానిక సంస్థలు ఎలా బలోపేతం అవుతాయి? దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు