మరో ఇరవై ఏళ్లయినా కూటమి ఇలానే కొనసాగుతుంది.. మంత్రిగా ఏడాది పాలనలో నా టాప్ విక్టరీస్‌ ఇవే..: మంత్రి వాసంశెట్టి 

మూడు పార్టీల కూటమి వల్ల రాష్ట్రం సేఫ్ జోన్ లో ఉంటుందని చెప్పొచ్చని అన్నారు.

AP Minister Vasamsetti Subhash

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ పాలనకు ఏడాది అవుతోంది. కూటమి ఏడాది పరిపాలనపై 10TV మెగా ఈవెంట్‌ “Shining AP” నిర్వహించింది. ఇందులో భాగంగా ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ మాట్లాడారు.

భారతీయ జనతా పార్టీ, జనసేనతో మిత్ర ధర్మం ఎలా ఉంది? ఎన్డీఏ కూటమి ఇంకా భవిష్యత్తులో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అలాగే, మంత్రిగా ఏడాది పాలనలో తాను సాధించిన టాప్ విక్టరీస్‌ గురించి తెలిపారు.

“మూడు పార్టీల కూటమి వల్ల రాష్ట్రం సేఫ్ జోన్ లో ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్రానికి మోదీ ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కల్యాణ్ కష్టపడుతున్న తీరు కూడా చాలా బాగుంది. ప్రతిది నేర్చుకుంటూ పూర్తి అవగాహన తెచ్చుకుంటే గాని ఏది మాట్లాడరు. ఆయన జగన్ లా మిడిమిడి జ్ఞానంతో ఏది మాట్లాడరు. ఆయన ఏది మాట్లాడినా ఏ పని చేసి క్లారిటీతో చేస్తారు. జనసేన, టీడీపీ, బీజేపీ లక్ష్యం ఒకటే ప్రజలు హ్యాపీగా ఉండాలి.

గత ఐదేళ్ల పాటు రాక్షస పాలనలో ఇబ్బంది పడ్డారు. లోకేశ్‌కి ప్రతి శాఖ మీద పూర్తి అవగాహన ఉంది. ఆయనలో కనీసం 10% కూడా జగన్మోహన్ రెడ్డికి ఉండదు. చంద్రబాబు నాయుడు విజనరీ నాయకుడు. ఆయనకు ఉన్న అనుభవంతో, లోకేశ్ చురుకుదనంతో ఈ రాష్ట్రంలో అందరం కలిసే ముందుకు వెళ్తున్నాం.

ఐదేళ్లు ఎలాంటి సమస్యలు లేకుండా మిత్ర ధర్మం కొనసాగుతుంది. ఐదేళ్లు కాదు 15 – 20 ఏళ్లు అయినా సరే ఈ కూటమి ఇలాగే కొనసాగుతుంది. మా మధ్య ఏ చిన్న డిస్టర్బెన్సులు లేవు. అందరం హ్యాపీగా ముందుకు వెళ్తున్నాం. ప్రజలని హ్యాపీగా పరిపాలిస్తాం. మేము కచ్చితంగా చెప్పగలం.. రాబోయే కాలంలో ఈ ఆంధ్రప్రదేశ్ ని సువర్ణ ఆంధ్రప్రదేశ్ గా రూపుదిద్దుతాం” అని తెలిపారు.

ఏడాదిలో నా శాఖలో ఇవి జరిగాయి..

కార్మిక శాఖ మంత్రిగా ఈ ఏడాదిలో సాధించిన టాప్ విక్టరీస్ గురించి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. “గత ఐదు సంవత్సరాలు ఈ కార్మికుల పట్ల, కార్మిక శాఖ పట్ల వైసీపీ పూర్తిగా అశ్రద్ధ వహించింది. దాని కారణంగానే మా ప్రభుత్వం ఫామ్ అయిన ఐదు నెలల వరకు కూడా సేఫ్టీ ఆడిటింగ్ లు సరిగ్గా లేకపోవడం వల్ల 43 మంది చనిపోయారు.

అదే టైంలో చంద్రబాబు ఎసెన్షియల్ లో పెద్ద యాక్సిడెంట్ అవ్వటం సుమారు 17 మంది చనిపోవడం వంటి ఘటనలు జరిగాయి. వెంటనే చంద్రబాబు నాయుడు అక్కడికి వచ్చి వెంటనే వసుధా మిశ్రా కమిటీ వేశారు. దాని మీద ఒక నివేదిక అందచేయాలని చెప్పారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడూలేని విధంగా భద్రతా వారోత్సవాలు నిర్వహించాం.

కార్మికులకి భద్రత పట్ల అవగాహన తీసుకురావడం కోసం సేఫ్టీ వాగ్దానం చేయించాం. ఇలాంటివి రాష్ట్రంలో తొలిసారిగా మూడు చోట్ల నిర్వహించాం. అదేవిధంగా ఐఎస్ఏ ఆసుపత్రులు సుమారు మన స్టేట్ లో ఐదు ఉన్నాయి. ఐదింట్లో ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా తిరుపతి హాస్పిటల్ ని 50 బెడ్ హాస్పిటల్ ని అప్‌గ్రేడ్ చేశాం.

రాజమండ్రి ఈఎస్ఐ 100 పడకల హాస్పిటల్ కూడా ఈ రెండు నెలలు మూడు నెలల్లో ఓపెన్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎలమంచిల్లో 30 బెడెడ్ హాస్పిటల్ కోసం ప్రధానమంత్రి వర్చువల్ శంకుస్థాపన కూడా చేశారు. అనేక ప్రాంతాల్లో ఇటువంటి పనులు చేస్తున్నాం.

అమరావతిలో 500 బెడెడ్ సెకండరీ కేర్ హాస్పిటల్ ఈఎస్ఐ సెకండరీ కేర్ హాస్పిటల్, దాంతో పాటు 150 పడకల సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ తో పాటు మెడికల్ కాలేజీ ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ కి కూడా ప్రతిపాదనలు పంపాం. మాకు ఇటు ఫ్యాక్టరీస్ యాజమాన్యం ప్లస్ వర్కర్స్ రెండు కళ్లు లాంటివి. బ్యాలెన్స్డ్ గా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి.

ఇటు లేబర్ లాస్ ని ఇంప్లిమెంట్ చేస్తూ వాళ్ల హక్కులు వాళ్లకి కల్పిస్తూ ముందుకు వెళ్తున్నాం. చంద్రబాబు విజనరీ ఉన్న నాయకుడు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి బాగుంటేనే, ఎంప్లాయ్మెంట్ వస్తేనే ఇక్కడ మనీ రొటేషన్ జరిగితేనే మన రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి బాగుంటది అని చెబుతూ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు” అని తెలిపారు.