Minister Vidadala Rajini : వైద్య రంగం గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు : మంత్రి విడదల రజినీ

ఆస్పత్రుల్లో రెగ్యులర్ గా సోషల్ ఆడిట్ చేస్తున్నామని చెప్పారు. ఎక్కడా ఆరోగ్యశ్రీకి డబ్బులు వసూళ్లు చేయడం లేదని స్పష్టం చేశారు.

Minister Vidadala Rajini

Minister Vidadala Rajini : టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ విమర్శలు చేశారు. వైద్య రంగం గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు తన హాయాంలో ఏం చేశారో చెప్పాలని మంత్రి రజినీ డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో సీఎం జగన్ ఎన్నో మార్పులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి 17మెడికల్ కళాశాలలు తీసుకొచ్చారని తెలిపారు.

ఐదు మెడికల్ కళాశాలల్లో ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు కూడా చేపడుతామని చెప్పారు. ఇంత మంచి చేస్తుంటే .. ఏమీ చేయని చంద్రబాబు విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీని 3250 జబ్బులకు పెంచి.. గతం కన్నా ఎక్కువగా వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఆరోగ్యశ్రీకి రూ.3వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామని.. ఆరోగ్యశ్రీపై గాలి మాటలు మాట్లాడవద్దన్నారు.

Andhra Pradesh HC : అమరావతి ఆర్5 జోన్‌పై ఏపీ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ .. రైతుల పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

ఆస్పత్రుల్లో రెగ్యులర్ గా సోషల్ ఆడిట్ చేస్తున్నామని చెప్పారు. ఎక్కడా ఆరోగ్యశ్రీకి డబ్బులు వసూళ్లు చేయడం లేదని స్పష్టం చేశారు. బిల్స్ కూడా పెండింగ్ లేకుండా అందించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్కరోజు 1700 నుంచి 1800 మంది పేషేంట్లు వస్తున్నారని వెల్లడించారు.

పేదలకు అందుతున్న వైద్యం గురించి నేరుగా తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నామని పేర్కొన్నారు. రోగులకు అందుతున్న వైద్యం, ఆస్పత్రుల్లో పరిస్థితుల గురించి నేరుగా తెలుసుకున్నామని తెలిపారు. అన్ని చోట్ల రోగులు, వారి బంధువులు వైద్య సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు.

Balineni Srinivasa Reddy: ఒంగోలు చేరుకున్న బాలినేని.. మీడియా సమావేశంపై ఉత్కంఠ.. ఏం చెబుతారో?

49వేల మందితో వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలు చేపట్టామని తెలిపారు. ఇది దేశంలో మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శమన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ దేశంలో ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. డాక్టర్లు గ్రామాలకు వెళ్లి 92లక్షల మందికి వైద్య సేవలు అందించారని పేర్కొన్నారు.