Andhra Pradesh HC : అమరావతి ఆర్5 జోన్‌పై ఏపీ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ .. రైతుల పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

ఆర్5 జోన్‌ లోని ఇళ్లస్థలాలను పేదలకు కేటాయిస్తు గతంలో జీవో నెంబర్ 45ను జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అయితే జీవో నెం.45ను రద్దు చేయాలని రైతులు కోరుతు వేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఏపీ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాజధాని ప్రాంత రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెబుతున్నారు రైతులు.

Andhra Pradesh HC : అమరావతి ఆర్5 జోన్‌పై ఏపీ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ .. రైతుల పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

AP High Court .. Farmers Petition

Andhra Pradesh HC : అమరావతి ఆర్5 జోన్‌ నిర్ణయంపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీవోనెంబర్ 45ను రద్దు చేయాలని రైతులు వేసిన పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. విచారణ జరిపి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేని తేల్చి చెప్పింది న్యాయస్థానం. దీంతో రైతులకు షాక్ తగిలింది. ఆర్5 జోన్‌ లోని ఇళ్లస్థలాలను పేదలకు కేటాయిస్తు గతంలో జీవో నెంబర్ 45ను జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అయితే జీవో నెం.45ను రద్దు చేయాలని రైతులు కోరుతు వేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఏపీ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాజధాని ప్రాంత రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెబుతున్నారు రైతులు.

ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా అమరావతిలో ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం ఆర్5 పేరిట ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆర్5 జోన్ కోసం గుంటూరు జిల్లా నుంచి 550.65 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లా నుంచి 583.93 ఎకరాల భూమిని కలెక్టర్లకు బదలాయించేందుకు సీఆర్డీయే కమిషనర్ అనుమతిస్తూ జీవో నెం.45ను ప్రభుత్వం తీసుకువచ్చింది.

ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. జీవో నెం.45ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అమరావతిలో స్థానికేతరులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. అమరావతి భూములను సీఆర్డీఏ ఒప్పందం ప్రకారమే అభివృద్ధి చేయాలని కోరారు. ఈక్రమంలో కోర్టు షాక్ ఇస్తూ పిటీషన్ కొట్టివేసింది. ఇళ్ల పట్టాల పంపిణీ కోర్టు తీర్పుకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును అమరావతి రైతులు సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నారు.