AP MPTC ZPTC Election Results : పరిషత్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పరిషత్ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ ఆధిక్యంలో ఉంది. దాదాపు అన్ని చోట్ల ఫ్యాన్ గాలి వీసింది.

AP MPTC ZPTC Election Results : ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పరిషత్ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ ఆధిక్యంలో ఉంది. దాదాపు అన్ని చోట్ల ఫ్యాన్ గాలి వీసింది. 9వేల 589 ఎంపీటీసీ స్థానాలకు, 641 జడ్పీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు చేపట్టగా… ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం వైసీపీ 4వేల 150 ఎంపీటీసీ స్థానాలు, 187 జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. టీడీపీ 286 ఎంపీటీసీ స్థానాలు దక్కించుకుంది. టీడీపీ ఖాతాలో ఒక్క జడ్పీటీసీ స్థానం కూడా లేదు. ఇక జనసేన 26 ఎంపీటీసీలు, బీజేపీ 14 ఎంపీటీసీలు, ఇతరులు 79 ఎంపీటీసీలు కైవసం చేసుకున్నారు.

Free Storage: ఫోన్‌లో ఫోటోలు సేవ్ చేసుకునేందుకు ఆన్‌లైన్ స్టోరేజ్ ‘ఫ్రీ’గా కావాలా?

ఈ ఫలితాలపై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. సీఎం జగన్ సంక్షేమ పాలనకు నిదర్శనం ఈ ఫలితాలు అని చెప్పారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన టీడీపీకి లేదని విమర్శించారు. పరిషత్ ఎన్నికల్లోనూ ఓడిపోతామని తెలిసే టీడీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. వైసీపీకి పట్టం కట్టిన ప్రజలకు మరో మంత్రి కన్నబాబు కృతజ్ఞతలు తెలిపారు.

WhatsApp Tricks : వాట్సాప్‌లో టైప్ చేయకుండానే మెసేజ్ పంపొచ్చు.. ఇదిగో ప్రాసెస్!

రాష్ట్రవ్యాప్తంగా 209 కేంద్రాల్లో కౌంటింగ్‌ జరుగుతోంది. కేంద్రాల దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. ఫలితాల అనంతరం విజయోత్సవాలు, ర్యాలీలపై పూర్తిగా నిషేధం విధించారు. రాష్ట్రంలో మొత్తం 10వేల 047 ఎంపీటీసీ స్థానాలున్నాయి. నోటిఫికేషన్ జారీ సమయంలో.. 375 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీపీ అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నిక ఈ నెల 24న జరుగుతుంది. జిల్లా పరిషత్ లో కో ఆఫ్షన్ మెంబర్స్, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక 25న జరుగుతుంది.

ఏపీలో మొత్తం జడ్పీటీసీ స్థానాలు 660 ఉండగా.. 8 చోట్ల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. 652 స్ధానాల్లో.. 126 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 515 స్ధానాలకు పోలింగ్ జరగగా.. 2వేల 058 అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. అలాగే మొత్తం 10వేల 047 ఎంపీటీసీ స్థానాలకు గాను 2వేల 371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వివిధ కారణాలతో 375 స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఇక, పోటీ చేసిన వారిలో 81 మంది అభ్యర్థులు మరణించారు. మిగిలిన 7వేల 220 స్థానాల్లో 18వేల 782 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఏప్రిల్ 8న ఎన్నికలు జరగ్గా మొత్తం 1,29,55,980 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అర్ధరాత్రి దాటినా లెక్కింపు ప్రక్రియను పూర్తి చేసి విజేతలను ప్రకటిస్తారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఫిర్యాదు స్వీకరణ కోసం 0866 2466877 నంబర్ తో కాల్‌ సెంటర్ ఏర్పాటు చేశారు.

ట్రెండింగ్ వార్తలు