Free Storage: ఫోన్‌లో ఫోటోలు సేవ్ చేసుకునేందుకు ఆన్‌లైన్ స్టోరేజ్ ‘ఫ్రీ’గా కావాలా?

Google ఫోటోల అపరిమిత స్టోరేజ్ ఫీచర్ ముగిసిన తర్వాత, మీరు అధిక నాణ్యత గల ఫోటోలు లేదా వీడియోలను అప్‌లోడ్ చేయడానికి Google Oneకి సబ్‌స్క్రిప్షన్‌ని కొనుగోలు చేయలవలసి వస్తుంది.

Free Storage: ఫోన్‌లో ఫోటోలు సేవ్ చేసుకునేందుకు ఆన్‌లైన్ స్టోరేజ్ ‘ఫ్రీ’గా కావాలా?

Free Google Photos Alternatives That You Can Try

Free Storage: Google ఫోటోల అపరిమిత స్టోరేజ్ ఫీచర్ ముగిసిన తర్వాత, మీరు అధిక నాణ్యత గల ఫోటోలు లేదా వీడియోలను అప్‌లోడ్ చేయడానికి Google Oneకి సబ్‌స్క్రిప్షన్‌ని కొనుగోలు చేయలవలసి వస్తుంది. క్లౌడ్‌లో ఇప్పటికే ఉన్న వినియోగదారుల డేటా మొత్తం ఈ 15GBకి మించిపోతే, Google One సబ్‌స్క్రిప్షన్ కచ్చితంగా అవసరం అవుతుంది. 100 GB స్టోరేజ్ కోసం నెలకు రూ.130 చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో, ఒక సంవత్సరానికి రూ.1300 ఫీజు చెల్లించాల్సి వస్తుంది.

ఇది కాకుండా, వినియోగదారులు 200 GB స్టోరేజ్ కావాలంటే నెలకు రూ. 210 చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో, ఒక సంవత్సరం పాటు స్టోరేజ్ కావాలంటే, రూ.2,100 ఫీజు చెల్లించాలి. 2TB దశలో, నెలకు రూ. 650 చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో, ఒక సంవత్సరం పాటు రూ. 6,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 10 TB కోసం, వినియోగదారులు రూ. 3,250 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

అయితే, Google One కాకుండా, మీరు ఉపయోగించగల అనేక ఇతర స్టోరేజ్ ప్లేస్‌లు ఇప్పుడు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Degoo:
Google Oneకి ప్రత్యామ్నాయంగా ఉపయోగించగల అప్లికేషన్స్ విషయానికి వస్తే, Google ఫోటోలు అప్‌లోడ్ కోసం Degoo ఒక మంచి ఎంపికగా కనిపిస్తుంది. స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రాఫర్స్ కోసం అప్‌లోడ్ చేయడానికి 100GB వరకు ఫ్రీ డేటా ఇస్తుంది. స్టోరేజ్ అప్‌లోడ్ 10TB వరకు ఉంటుంది. ఒకవేళ ప్రో లెవల్‌కు వెళ్తే 500 జీబీ స్టోరేజ్‌ అందుబాటులో ఉంటుంది. స్పాన్సర్ యాడ్స్‌ను చూసినా.. వినియోగదారులను ఇన్వైట్ చేసినా కొంత ఫ్రీ స్టోరేజ్‌ ఇస్తుంది.

TeraBox Cloud Storage:
గూగుల్‌​ ఫొటోస్‌కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న క్లౌడ్ స్టోరేజ్‌లో ఇది ఒకటి. ఈ యాప్‌లో 1టీబీ(వెయ్యి జీబీ) ఉచిత స్టోరేజ్‌ లభిస్తుంది. ఫైల్స్‌, ఫొటోస్‌, వీడియోలు, ఫోల్డర్‌లు ఏవైనా దాచుకోవచ్చు. అయితే వీడియోలు ఆటోమేటిక్‌గా బ్యాక్‌ప్‌లోకి వెళ్లాలంటే మాత్రం.. ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉండాల్సిందే. ఇక ఫొటోలను మాత్రం ఉచితంగా బ్యాకప్‌ చేసుకునేందుకు ఎనేబుల్‌ బటన్‌ను క్లిక్‌ చేయాల్సి ఉంటుంది.

JioCloud – Free Cloud Storage:
గూగుల్‌ ఫొటోస్‌కు ఒక ఉచిత ప్రత్యామ్నాయంగా ఇది కనిపిస్తోంది. జియో క్లౌడ్‌ స్టోరేజ్‌‌లో ఉచిత 50జీబీ స్టోరేజ్‌ ఉంది. రిఫరెన్స్‌, ప్రమోషన్స్ ద్వారా మరికొంత ఫ్రీ స్టోరేజ్‌ను పొందవచ్చు.