AP Night Curfew : ఏపీలో నేటి నుంచి రాత్రిపూట కర్ఫ్యూ

ఏపీలో నేటి నుంచి రాత్రిపూట కర్ఫ్యూ అమలు కానుంది. కర్ఫ్యూ విధివిధానాలను ఖరారుచేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది.

AP Night Curfew : ఏపీలో నేటి నుంచి రాత్రిపూట కర్ఫ్యూ అమలు కానుంది. కర్ఫ్యూ విధివిధానాలను ఖరారుచేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. అయితే తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో కార్యాలయాలు, హోటళ్లు, వాణిజ్య సంస్థలు మూసివేయాలని ఆదేశాల్లో పేర్కొంది. అత్యవసర సేవలకు మాత్రమే కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొంది. ఆస్పత్రులు, ల్యాబ్ లు, ఫార్మసీలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొంది.

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజే రాష్ట్రంలో 50వేల 972 శాంపిల్స్ పరీక్షించగా 11వేల 698మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. మరో 37మంది కరోనాతో మరణించారు. తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఆరుగురు చొప్పున.. అనంతపురం, చిత్తూరులో నలుగురు చొప్పున.. శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున.. గుంటూరు, కృష్ణా, కర్నూలు, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, ప్రకాశంలో ఒకరు మరణించారు. ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 10,20,926కి చేరింది. మృతుల సంఖ్య 7వేల 616కి పెరిగింది.

ట్రెండింగ్ వార్తలు