Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్‌షాక్.. లుకౌట్‌ నోటీసులు జారీ..

ముంబై లో గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న నాని.. త్వరలో అమెరికా వెళ్తారంటూ ప్రచారం జరుగుతుంది.

Kodali Nani

Kodali Nani: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ ఈ నోటీసులను జారీ చేసినట్లు తెలుస్తోంది. కొడాలి నానిపై అక్రమాలకు సంబంధించి విజిలెన్స్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన కదలికలపై నిఘా ఉంచాలని ఇప్పటికే టీడీపీ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. తాజాగా.. లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు.. దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులు, పోర్టులను అలర్ట్ చేశారు.

నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. ఇటీవల ముంబై లో గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న నాని.. త్వరలో అమెరికా వెళ్తారంటూ ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ఆయనపై లుకౌట్ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది.