ఏపీలో కరోనా పరీక్షల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోంది. అత్యధిక స్థాయిలో పరీక్షలు చేస్తుండగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మరో ముందుడుగు వేస్తూ వీధిబాలలకు కూడా కరోనా పరీక్షలు చేస్తున్నారు అధికారులు. కేవలం కరోనా వచ్చిందనే వ్యక్తులకే కాకుండా ఎటువంటి ఆసరా లేని వీధి బాలలకు ఏపీ సీఐడీ ఆధ్వర్యంలో 3 నుంచి 17 సంవత్సరాల వయస్సు కలిగిన బాలకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలా ఒకే రోజు 1,198మంది పిల్లలకు కరోనా పరీక్షలు నిర్వహించారు.
డీజీపీ గౌతమ్ సవాంగ్ జులై 14న ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్–19 కార్యక్రమాన్ని ప్రారంభించగా..రాష్ట్రంలోని 13 జిల్లాల్లో టెస్టులు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వీధి బాలలను గుర్తించి వారికి కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. అలా ఇప్పటి వరకు 2వేల ,670 మంది వీధి బాలలకు టెస్టులు చేయగా అందులో ముగ్గురికి కరోనా లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించారు. వీరిని ఆస్పత్రికి తరలించారు.
ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు,విజయనగరం జిల్లాలో ఉన్నారు. వీధి బాలల్లో 2,500 మందిని తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. కాగా వీధి బాలలకు ప్రత్యేకించి కరోనా పరీక్షలు చేయడం దేశంలోనే తొలిసారి కావడం విశేషం.