AP Polycet Results: ఏపీ పాలిసెట్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

ఏపీ పాలిసెట్ -2023 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 86.35 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

Ap Polycet Results

AP Polycet Results: ఏపీ పాలిసెట్ -2023 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి చైర్మన్ చదలవాడ నాగరాణి విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 87 ప్రభుత్వ, 171 ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో 29 బ్రాంచ్‌లలో మూడేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు ఈ పరీక్షలు జరిగాయి.

 

రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 10వ తేదీన పాలిటెక్నిక్ – 2023 ప్రవేశ పరీక్షలు జరిగాయి. ఈ ప్రవేశ పరీక్షకోసం 1,60,329 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,43,625మంది పరీక్షకు హాజరయ్యారు. ప్రస్తుతం విడుదల చేసిన ఫలితాల్లో 1,24,021 మంది అర్హత సాధించారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 86.35శాతంగా నమోదైంది. వీరిలో బాలికల ఉత్తీర్ణత శాతం 88.90శాతం కాగా, బాలురు 84.74శాతం ఉత్తీర్ణత సాధించారు.

 

ఫలితాలు ఇలా చెక్ చేసుకోవచ్చు..

అభ్యర్థులు మొదటగా  https://polycetap.nic.in సైట్‌లోకి వెళ్లాలి.

వెబ్‌సైట్ పైభాగంలో పాలిసెట్ ర్యాంక్ కార్డు అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.

ఆ తరువాత మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి.

సబ్మిట్ బటన్ నొక్కిన తరువాత మీ ర్యాంకు కార్డు డిస్ ప్లే అవుతుంది.

ప్రింట్, డౌన్‌లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి ర్యాంకు కార్డు పొందవచ్చు.

పాస్ వర్డ్ : EMPLOYABILTY