Ap Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఆరు జిల్లాల్లో పిడుగులతో భారీ వర్షాలు.. విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు

ఆంధ్రప్రదేశ్ ఉపరితల ఆవర్తనం, ద్రోణి తీవ్ర ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు (Ap Rain Alert)కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది.

Meteorological department key update on rains in andhra pradesh

  • ఆరు జిల్లాల్లో వర్షాల హెచ్చరిక
  • ఈదురుగాలులు పిడుగులతో తీవ్ర ముప్పు
  • తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Ap Rain Alert: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాతావరణంలో మళ్లీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఉపరితల ఆవర్తనం, ద్రోణి తీవ్ర ప్రభావంతో రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో గంటకు 50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదముంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు (Ap Rain Alert)పడతాయని అధికారులు అంచనా వేశారు. ఇక నిన్న అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో ఏకంగా 66.7 మి.మీ వర్షపాతం రికార్డయ్యింది.

Indian Bullet Train: జపాన్ ‘షింకన్సేన్‌’కు భారత్ గుడ్ బై.. 2027 నాటికే స్వదేశీ బుల్లెట్ రైలు.. అసలు కారణం ఇదే!

ప్రమాద నివారణ చర్యలపై విపత్తుల సంస్థ హెచ్చరికలు:

వర్షాలు, పిడుగుల ఉధృతి నేపథ్యంలో ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అత్యవసర మార్గదర్శకాలు విడుదల చేసింది. తుఫాను గాలుల సమయాల్లో చెట్ల కిందగానీ, వ్యాపార హోర్డింగ్స్ వద్దగానీ ఆశ్రయం పొందడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది. గాలుల ధాటికి కరెంట్ వైర్లు తెగిపడే అవకాశం ఉన్నందున, స్థానికులు విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది.

తీరప్రాంతం, మత్స్యకారుల జాగ్రత్తలు:

సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారనున్నందున మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని యంత్రాంగం కఠిన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా అలల తాకిడి ఎక్కువగా ఉన్నప్పుడు చిన్నబోట్లలో సముద్రంలోకి వెళ్లడం ప్రమాదకరమని స్పష్టం చేసింది. తీరప్రాంత ప్రజలు వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు.