Indian Bullet Train: జపాన్ ‘షింకన్సేన్’కు భారత్ గుడ్ బై.. 2027 నాటికే స్వదేశీ బుల్లెట్ రైలు.. అసలు కారణం ఇదే!
భారతదేశ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ (Indian Bullet Train)కారిడార్లో ఒక సంచలనాత్మక మార్పు చోటుచేసుకుంది.
Instead of Japanese Shinkansen India is set to manufacture its own bullet train by 2027
- జపాన్ షింకన్సేన్ ఆలస్యంపై అసంతృప్తి
- స్వదేశీ బుల్లెట్ రైలు తయారీ
- ఆగస్టు 2027 నాటికి ప్రారంభం
Indian Bullet Train: భారతదేశ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ కారిడార్లో ఒక సంచలనాత్మక మార్పు చోటుచేసుకుంది. అదేంటంటే, జపాన్ అభివృద్ధి చేస్తున్న ‘ఈ10 షింకన్సేన్’ (E10 Shinkansen) రైళ్ల సరఫరాను ప్రభుత్వం పక్కన పెట్టేసింది. కారణం ఏంటంటే, ఈ ప్రెజెక్టు తీవ్రంగా ఆలస్యం అవుతోంది. అందుకే, భారత్ ఇక ఏమాత్రం వేచి చూడకూడదని నిర్ణయించింది. సొంత సాంకేతికతతో స్వదేశీ బుల్లెట్ రైళ్ల(Indian Bullet Train)ను తయారు చేసి పట్టాలెక్కించేందుకు భారత రైల్వే శాఖ రంగాన్ని సిద్ధం చేస్తోంది.
Supreme Court: అయోధ్య కేసును రాజకీయం చేయొద్దు.. సుప్రీం కోర్ట్ సంచలన కామెంట్స్
జపాన్ ఆలస్యానికి ప్రధాన కారణాలు:
ముంబై-అహ్మదాబాద్ ప్రాజెక్టు కోసం జపాన్ అందించాల్సిన E10 మోడల్ రైళ్లు ఇంకా డిజైన్ దశలోనే ఉండటమే ఈ ఆలస్యానికి ముఖ్య కారణం. అలాగే, గతంలో అనుకున్న E5 సిరీస్ ఉత్పత్తిని నిలిపివేయడం కూడా పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది. ఇప్పటివరకు జపాన్ నుంచి రైలు సెట్లు, సిగ్నలింగ్ వ్యవస్థ, ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ కోసం ఎటువంటి స్పష్టమైన ప్రతిపాదనలు అందకపోవడంతో, భారత్ తన ప్రాజెక్ట్ గడువును కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోక తప్పలేదు.
అంతర్జాతీయ ప్రమాణాలతో 2027 లక్ష్యంగా:
దక్షిణ కొరియా, తైవాన్ వంటి దేశాల విజయవంతమైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈ ప్రాజెక్ట్ మొదటి విడతను ఆగస్టు 2027 నాటికి ప్రారంభించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందిన యూరోపియన్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్ (ETCS) సిగ్నలింగ్ను ఉపయోగించనున్నారు. సివిల్ పనులను వేగవంతం చేస్తూ, మేక్ ఇన్ ఇండియా కింద తయారయ్యే స్వదేశీ బుల్లెట్ రైళ్లతో ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. దీంతో, ఈ నిర్ణయం ఇప్పుడు సంచలంగా మారింది.
