Rains: వామ్మో.. గంటల్లోనే 35వేల మెరుపులు.. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు

ఏపీలో పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.

Lightning

AP Rains: ఏపీలోని పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో పలు ప్రాంతాల్లో రహదారులపై చెట్లు నేలకొరిగి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విజయవాడలో ఆదివారం ఉదయం నుంచి భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన బీభత్సంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

Also Read: Gold Prices: బంగారం ధరలు పడిపోతున్నాయ్.. రాబోయే మూన్నెళ్లలో భారీగా తగ్గే ఛాన్స్.. అందుకు కారణాలు ఇవే..

ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉభయగోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులకు తోడు ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో కల్లాల్లో రైతులు ఆరబోసిన పంట ఉత్పత్తులు తడిసిపోయాయి. రానున్న నాలుగు రోజులు ఏపీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు.. గంటల్లో 35వేల మెరుపులు సంభవించాయి.

Also Read: IPL 2025: సీఎస్‌కేను దారుణంగా దెబ్బకొట్టిన రొమారియో షెపర్డ్.. చివరి రెండు ఓవర్లలో విధ్వంసం.. ఎంఎస్ ధోనీ ఏమన్నాడంటే..?

ఏపీలో పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గంటల్లోనే 35వేల మెరుపులు సంభవించినట్లు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఏపీలో ఉదయం నుంచి ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, ఎన్టీఆర్, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో 35 వేలకు పైగా మెరుపులు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. మరికొన్ని గంటలపాటు వర్షాలు కొనసాగుతాయని తెలిపారు. భారీగా ఉరుములు, మెరుపులు వస్తున్నందున పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.