Gold Prices: బంగారం ధరలు పడిపోతున్నాయ్.. రాబోయే మూన్నెళ్లలో రూ.88,000కి పడొచ్చని అంచనా..

గతేడాది ఏప్రిల్ నెలలో 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ రేటు రూ.75వేలుగా ఉంది. అప్పటి నుంచి దాదాపు 25శాతం వరకు గోల్డ్ రేటు పెరిగింది.

Gold Prices: బంగారం ధరలు పడిపోతున్నాయ్.. రాబోయే మూన్నెళ్లలో రూ.88,000కి పడొచ్చని అంచనా..

Gold

Updated On : May 5, 2025 / 11:34 AM IST

Gold Prices: బంగారం పేరు వింటేనే సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గత పదిరోజుల క్రితం వరకు గోల్డ్ రేటు ఆకాశమే హద్దుగా దూసుకెళ్లింది. దీంతో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.లక్ష దాటింది. కానీ, కొద్దిరోజులుగా బంగారం ధరలు దిగొస్తున్నాయి. ప్రస్తుతం 24క్యారట్ల గోల్డ్ రేటు రూ.93వేలకు దిగొచ్చింది. అంతర్జాతీయంగా స్పాట్ బంగారం 1.8శాతం తగ్గి ఔన్సుకు 3,255.60 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అయితే, వచ్చే మూడు నెలల్లో గోల్డ్ రేటు రూ.88వేల మార్క్ కు చేరుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

 

గతేడాది ఏప్రిల్ నెలలో 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ రేటు రూ.75వేలుగా ఉంది. అప్పటి నుంచి దాదాపు 25శాతం వరకు గోల్డ్ రేటు పెరిగింది. 2025 ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టగానే చైనా సహా ప్రపంచ దేశాలు అన్నింటిపైన సుంకాలు పెంచేశారు. వాణిజ్య యుద్ధం కారణంగా బంగారం ధరలు రికార్డు స్థాయిలను నమోదు చేశాయి. ప్రస్తుతం గోల్డ్ రేటు క్రమంగా తగ్గుతుంది.

 

ఏంజెల్ వన్‌లో కమోడిటీస్, కరెన్సీల చీఫ్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ తేజస్ అనిల్ షిగ్రేకర్ మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. దక్షిణ కొరియా, జపాన్, భారతదేశంతో సంభావ్య వాణిజ్య ఒప్పందాల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనలతోపాటు.. చైనా, అమెరికా మధ్య ట్రేడ్ వార్ ఉధృతి కూడా కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో బంగారం ధరలు తగ్గుదలకు కారణం అవుతున్నాయని తెలిపారు.

 

నిర్మల్ బ్యాంగ్ కమోడిటీస్ రీసెర్చ్ హెడ్ కునాల్ షా మాట్లాడుతూ.. రాబోయే మూడు నుంచి నాలుగు నెలల్లో అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్సు కు 3,000 డాలర్ల లేదా 2,950 డాలర్లకు చేరుకుంటుంది. భారత్ లో 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ రేటు రూ. 88,000 దిగువకు పడిపోతుందని ఆయన అంచనా వేశారు. ఇదే అభిప్రాయాన్ని ఏంజెల్ వన్ కు చెందిన అనిల్ షిగ్రేకర్ వ్యక్తం చేశారు. వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం వల్ల బంగారంపై ఇన్వెస్టర్ల పెట్టుబడి తగ్గుతుందని, తద్వారా రాబోయే కొద్దికాలంలో గోల్డ్ రేటు మరింత తగ్గుతుందని అంచనా వేశారు.