4స్థానాలు…5 అభ్యర్థులు : ఏపీలో రేపే రాజ్యసభ ఎన్నికలు

కోవిడ్-19 నేపథ్యంలో విధించబడిన దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా మార్చి నెలలో జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే వాయిదా పడిన రాజ్యసభ ఎన్నికలు జూన్-19న జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం జూన్-1న ప్రకటించింది.

మొత్తం 18 రాజ్యసభ స్థానాలకు  జూన్-19న ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈ నేపథ్యంలో  ఆంధ్రప్రదేశ్ లోని నాలుగు రాజ్యసభ స్థానాలకు శుక్రవారం(జూన్-18,2020) ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ప్రాంగణంలో పోలింగ్ నిర్వహించేందుకు సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు.

రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. 5 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు రిటర్నింగ్ అధికారి ఫలితాలు వెల్లడిస్తారు. వైసీపీ నుంచి నలుగురు, టీడీపీ నుంచి ఒకరు రాజ్యసభ బరిలో నిలిచారు. వైసీపీ నుంచి  రాజ్యసభకు మంత్రులు  పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ,   పారిశ్రామిక వేత్త, రాంకీ సంస్థల అధినేత ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, గుజరాత్ కు చెందిన అంబానీ సన్నిహితుడు పరిమల్ నత్వాని పోటీ చేస్తున్నారు.

ఇక టీడీపీ నుంచి వర్ల రామయ్య బరిలో ఉన్నారు. 4 సీట్లకు ఐదుగురు అభ్యర్థులు పోటీచేస్తున్నారు. టీడీపీ తమ అభ్యర్థిని దించకుంటే ఏపీలో ఎన్నికలు ఏకగ్రీవమయ్యేవి

ట్రెండింగ్ వార్తలు