AP Covid Update : ఆంధ్రప్రదేశ్‌లో తగ్గిన కోవిడ్ కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కోవిడ్ కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. నిన్నటికంటే ఈరోజు ఇంకో 16 కేసులు తగ్గాయి.

Ap Covid Records

AP Covid Update :  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కోవిడ్ కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. నిన్నటికంటే ఈరోజు ఇంకో 16 కేసులు తగ్గాయి. ఆంధ్ర‌ప్రదేశ్ ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్ర‌కారం..రాష్ట్రంలో నిన్న కొత్తగా 121 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. చిత్తూరు జిల్లాలో 32, కృష్ణాజిల్లాలో 20,విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 13 చొప్పున కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌‌తో కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. నిన్న 228 మంది కోవిడ్ బాధితులు పూర్తి స్ధాయిలో కోలుకున్నారు.

Also Read : Omicron Variant: 89దేశాలకు పాకిన ఒమిక్రాన్.. 3రోజుల్లోనే కేసులు రెట్టింపు

ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,09,90,296 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,75,804 కు చేరింది. ఇక కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 20,59,728 కు చేరుకోగా.. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 14,479 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,597 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

Ap Covid Records On Sataurday