AP Corona : ఏపీలో కరోనా కేసులు తగ్గినట్టే మళ్లీ భారీగా పెరిగాయి. నిన్నటి పోలిస్తే కొత్త కేసులు భారీగా నమోదయ్యాయి. నిన్న 127 కేసులే నమోదవగా, తాజాగా ఏకంగా 200కు దగ్గరగా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.
ఏపీలో గడచిన 24 గంటల్లో 26వేల 119 కరోనా పరీక్షలు నిర్వహించగా 196 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 34 , చిత్తూరు జిల్లాలో 29, పశ్చిమ గోదావరి జిల్లాలో 21, గుంటూరు జిల్లాలో 21 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా అనంతపురం జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి.
Computer Work : గంటల కొద్దీ కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లతో గడిపేవారికి వచ్చే వ్యాధులు ఇవే
అదే సమయంలో 242 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరొకరు కరోనాతో మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,71,567 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 20,54,979 మంది ఆరోగ్యవంతులయ్యారు. 2వేల 159 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా మృతుల సంఖ్య 14,429కి పెరిగింది.
Water : అధిక మోతాదులో నీరు తాగుతున్నారా!..అయితే జాగ్రత్త?…
ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గింది. కొత్త కేసులు కాస్త తక్కువగానే వస్తున్నాయి. అయినప్పటికి ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనని నిపుణులు తేల్చి చెప్పారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం మస్ట్ అంటున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ టీకాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వాలు కూడా పెద్దఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమాలు చేపడుతున్నాయి. దాదాపుగా చాలా మంది రెండు డోసులు కూడా తీసుకున్నారు. అంతా వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా దరి చేరదని నిపుణులు చెబుతున్నారు. మానవాళికి ముప్పుగా మారిన కరోనావైరస్ మహమ్మారి నుంచి కాపాడుకోవాలంటే ఏకైక మార్గం వ్యాక్సిన్ మాత్రమే.
#COVIDUpdates: 23/11/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,68,672 పాజిటివ్ కేసు లకు గాను
*20,52,084 మంది డిశ్చార్జ్ కాగా
*14,429 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,159#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/C94ILjHxV4— ArogyaAndhra (@ArogyaAndhra) November 23, 2021
కాగా, దేశవ్యాప్తంగా చూసుకుంటే కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఏకంగా 543 రోజుల కనిష్ట స్థాయికి ఈ సంఖ్య చేరుకుంది. సోమవారం దేశవ్యాప్తంగా 9,64,980 మంది కరోనా పరీక్షలు చేయగా.. 7వేల 759 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఒక్క కేరళలోనే 3,698 కేసులు నమోదం కావడం గమనార్హం. దేవ్యాప్తంగా నమోదైన కేసుల్లో దాదాపు సగం కేసులు కేరళలోనే నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం.
దేశవ్యాప్తంగా మరో 236 మంది కరోనాతో మరణించారు. ఒక్క కేరళలోనే కరోనాతో 180 మంది చనిపోయారు. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్యా పెరుగుతోంది. రికవరీ రేటు 98.32 శాతానికి చేరింది. ఇప్పటివరకు 3.45 కోట్ల మంది కరోనా బారిన పడగా.. 4,66,147 మంది మృత్యవాత పడ్డారు. ఇక దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటివరకు 117 కోట్లకుపైగా డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారు.