Water : అధిక మోతాదులో నీరు తాగుతున్నారా!..అయితే జాగ్రత్త?…

రోజూ 7-8 గ్లాసుల నీరు త్రాగటం మంచిది. వేడి వేసవి రోజులలో ఈ పరిమాణం 10 గ్లాసుల వరకు వెళ్ళవచ్చు.

Water : అధిక మోతాదులో నీరు తాగుతున్నారా!..అయితే జాగ్రత్త?…

Water (1)

Water : సమస్త జీవరాశికి ప్రకృతి ప్రసాదించిన ఓ వరం నీరు. మానవ జీవితానికి నీరు ప్రాథమిక అవసరాలలో ఒకటి. మనుగడకు మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జీవనానికి కూడా నీరు అవసరం.మనిషి శరీరంలో 80 శాతం నీరు ఉంటుంది. మన శరీరంలోని అవయవాలు, కణాలు సరిగ్గా పని చేయాలంటే సరైన మోతాదులో నీరు తీసుకోవాలి. అందుకే ఎక్కువ మంది నీరు ఎక్కువగా తీసుకుంటుంటారు.  అదేపనిగా అధికంగా నీరు తాగితే మాత్రం అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చాలామంది రోజుకు 3 నుంచి 4 లీటర్లు తాగుతుంటారు. అయితే మనం తీసుకునే చాలా ఆహారాల్లో నీరు ఉంటుంది కాబట్టి రోజుకు 3 లీటర్ల నీరు తీసుకున్నా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక హైడ్రేషన్‌కు దారి తీస్తుంది. ఇది మరీ ప్రమాదం కాకపోయినప్పటికీ.. కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మనిషి విసర్జించే మూత్రం యొక్క రంగు కూడా మనం ఎంత నీరు తీసుకుంటున్నామనే విషయాన్ని చెబుతుంది. మూత్రం నీలం రంగులో ఉంటే మనం తీసుకునే నీటి మోతాదును తగ్గించుకోవాలని అర్థం.

నీరు ఎక్కువగా తాగడం వల్ల మూత్ర విసర్జన ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఎక్కువమంది రోజుకు 6 నుంచి 8 సార్లు మూత్ర విసర్జన చేస్తుంటారు. అయితే రోజుకు 10సార్లు మూత్ర విసర్జన చేసేవాళ్లు ఎక్కువగా నీళ్లు తీసుకుంటారని భావించవచ్చు. దీని వల్ల ఎక్కువగా అలసిపోయే ప్రమాదం ఉంటుంది. చేతులు, పాదాలు, పెదాల్లో వాపు ఉండటం కూడా ఎక్కువ నీరు తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాల్లో ఒకటి. ఎక్కువగా నీళ్లు తీసుకోవడం వల్ల రక్తంలో సోడియం లెవల్స్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇది హైపోనాట్రిమియాకు కారణమవుతుంది. తలనొప్పి, వాంతులు, డయేరియా వంటి లక్షణాలు చవిచూడాల్సివస్తుంది. మన చేతులు, పాదాలు నొప్పి పెడితే అధిక హైడ్రేషన్‌గా భావించాలి.

రోజూ 7-8 గ్లాసుల నీరు త్రాగటం మంచిది. వేడి వేసవి రోజులలో ఈ పరిమాణం 10 గ్లాసుల వరకు వెళ్ళవచ్చు. అవసరమైన నీటి పరిమాణం మీ శరీర పరిమాణం మరియు జీవక్రియపై కూడా ఆధారపడి ఉంటుంది. ఎక్కువ నీరు తాగడం వల్ల తీవ్రమైన విరేచనాలు మరియు దీర్ఘకాలిక చెమట వస్తుంది. ఇది హైపోకలేమియా లేదా పొటాషియం అయాన్ల లోపం వల్ల వస్తుంది. తాగునీటిని క్రిమిసంహారక చేయడానికి క్లోరిన్ ఉపయోగిస్తారు. అయితే, ఎక్కువ నీరు తాగడం వల్ల క్లోరిన్ అధిక మోతాదు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అది జరిగినప్పుడు, మీరు మూత్రాశయం మరియు పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువ నీరు తాగడం వల్ల డయాలసిస్ చేయించుకునే వారిలో గుండె ఆగిపోతుంది. రక్త పరిమాణం పెరగడం రక్త నాళాలు మరియు గుండెపై అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తుంది.