Ap Corona Cases
AP Corona : రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, ఒక్కోరోజు కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. తాజాగా, కొత్త కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. 500కి పైనే కేసులు నమోయ్యాయి. నిన్నటితో పోలిస్తే స్వల్పంగా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 44,086 నమూనాలను పరీక్షించగా.. 523 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం సాయంత్రం వెల్లడించింది.
Flipkart Discount Offer: ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ ఆఫర్.. చౌకగా 5G స్మార్ట్ ఫోన్!
కరోనా మరణాల సంఖ్య గణనీయంగా తగ్గడం ఊరటనిచ్చే అంశం. తాజాగా మరో ముగ్గురు కరోనాతో మృతి చెందారు. కొవిడ్ వల్ల ప్రకాశం జిల్లాలో ఇద్దరు, కృష్ణాలో ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 608 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5వేల 566 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Google User Data : యూజర్ చనిపోతే వారి డేటాను గూగుల్ ఏం చేస్తుందో తెలుసా?
తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 87, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి.
#COVIDUpdates: 20/10/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,58,915 పాజిటివ్ కేసు లకు గాను
*20,39,029 మంది డిశ్చార్జ్ కాగా
*14,320 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 5,566#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/qMvUVrFbAA— ArogyaAndhra (@ArogyaAndhra) October 20, 2021