AP Corona Cases : ఏపీలో ఒక్కరోజే 7వేలకు చేరువలో కేసులు.. ఆ రెండు జిల్లాల్లో కరోనా టెర్రర్!

ఏపీలో కరోనావైరస్ మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఒక్కరోజే 7వేలకు చేరువగా కోవిడ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది.

AP Corona Cases : ఏపీలో కరోనావైరస్ మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఒక్కరోజే 7వేలకు చేరువగా పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. నిన్నటి కంటే 2వేల 888 ఎక్కువ కేసులు నమోదవడం కలవర పెట్టిస్తోంది.

Covid New Guidelines: కొవిడ్ కొత్త మార్గదర్శకాలు.. ఆగకుండా దగ్గు వస్తే టీబీ పరీక్ష చేయించుకోండి

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 38వేల 055 కరోనా టెస్టులు చేయగా.. 6వేల 996 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కరోనాతో మరో నలుగురు చనిపోయారు. అదే సమయంలో 1066 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 36వేల 108 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Asteroid : భూమి వైపు దూసుకొస్తున్న డేంజరస్ ‘గ్రహశకలం’

తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1534 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత విశాఖపట్నం జిల్లాలో 1263 కేసులు వెలుగుచూశాయి. విశాఖపట్నంలో ఇద్దరు కరోనాతో చనిపోగా.. చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున కోవిడ్ తో మరణించారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 14వేల 514కి పెరిగింది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,17,384. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 20,66,762.
నేటి వరకు రాష్ట్రంలో 3,19,22,969 కరోనా టెస్టులు చేశారు.

నిన్నటితో పోలిస్తే ఒక్కరోజు వ్యవధిలోనే 2వేల 888 ఎక్కువ కేసులు అధికంగా నమోదవడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు పరిస్థితి ఇంకెంత భయంకరంగా ఉంటుందోనని అంతా కంగారు పడుతున్నారు. కాగా, పరిస్థితి మరింత దిగజారక ముందే.. కరోనా ఆంక్షలను ప్రభుత్వం మరింత కఠినతరం చేయాల్సిందేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు