AP Covid Update : ఏపీలో కొత్తగా 8 కోవిడ్ కేసులు

ఏపీలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న 26 జిల్లాలలో 8  కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మరో 14 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

AP Covid Update : ఏపీలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్న 26 జిల్లాలలో 8  కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మరో 14 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో నిన్న 3,686 మంది శాంపిల్స్ పరీక్షించారు. దీంతో ఇప్పటి వరకు శాంపిల్స్ పరీక్షించిన వారి సంఖ్య 3,34,69,666కు చేరుకుంది.

రాష్ట్రంలో కోవిడ్ మరణాలు ఏమీ సంభవించలేదు. మొన్న రాష్ట్రంలో 3వేల 956 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 5 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

మరోవైపు దేశంలో ఒమిక్రాన్ ఎక్స్ ఈ వేరియంట్ కేసు నమోదు అవటంతో వచ్చే ఆదివారం నుంచి 18 ఏళ్లు పైబడిన అందరికీ బూస్టర్ డోస్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దేశంలోని అన్ని ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాలలో ఈ బూస్టర్ డోసులు లభిస్తాయి.
Also Read : Odisha Journalist : జర్నలిస్ట్‌పై దాడి చేసి కాళ్లకు బేడీలు వేసిన పోలీసులు
రెండో డోసు వేయించుకున్న 90 రోజులు దాటిన తర్వాత వారు మాత్రమే బూస్టర్ డోసు వేసుకోటానికి అర్హులని కేంద్ర ప్రక టించింది. ప్రంట్ లైన్ వర్కర్లకు ఉచితంగా వేసిన కేంద్ర ఆదివారం నుంచి వేసే బూస్టర్ డోసు కు ప్రజలు నిర్ణీత రుసుము చెల్లించాలని పేర్కోంది.

Ap Covid Update

ట్రెండింగ్ వార్తలు