AP Corona Cases : ఏపీలో తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే కొత్త కేసులు మళ్లీ తగ్గడం ఊరటనిచ్చే అంశం. మరోసారి 100కి లోపే కొత్త కేసులు నమోదయ్యాయి.

Ap Corona Cases

AP Corona Cases : ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే కొత్త కేసులు మళ్లీ తగ్గడం కాస్త ఊరటనిచ్చే అంశం. మరోసారి 100కి లోపే కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 29వేల 801 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 94 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 15 కేసులు వెలుగుచూశాయి. గుంటూరు జిల్లాలో 12, పశ్చిమ గోదావరి జిల్లాలో 11 కొత్త కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

అదే సమయంలో కరోనాతో మరో ఇద్దరు మరణించారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,488కి పెరిగింది. అదే సమయంలో గడిచిన 24 గంటల్లో 139 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,76,306 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 20,60,539 మంది ఆరోగ్యవంతులయ్యారు. రాష్ట్రంలో 1,279 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Lemon Juice : గ్యాస్ సమస్య ఉంటే తేనె, నిమ్మరసం కలిపి తీసుకోకూడదా?

కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా జాగ్రత్తగా ఉండాల్సిందేనని అధికారులు హెచ్చరిస్తున్నారు. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు.

కాగా, కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఒమిక్రాన్ రూపంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. డెల్టా కన్నా వేగంగా వ్యాపిస్తూ భయాందోళనకు గురి చేస్తోంది. మన దేశంలోనూ ఒమిక్రాన్ కలవరం రేపుతోంది. క్రమంగా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి.

ఒమిక్రాన్ ముప్పు నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనని నిపుణులు తేల్చి చెప్పారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం మస్ట్ అంటున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ టీకాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వాలు కూడా పెద్దఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమాలు చేపడుతున్నాయి. దాదాపుగా చాలామంది రెండు డోసులు తీసుకున్నారు. మానవాళికి ముప్పుగా మారిన కరోనావైరస్ మహమ్మారి నుంచి కాపాడుకోవాలంటే ఏకైక మార్గం వ్యాక్సిన్ మాత్రమే అని నిపుణులు తేల్చి చెప్పారు.

Garlic : రోజూ వెల్లుల్లి తీసుకుంటే బరువు తగ్గవచ్చా?

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రాలకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. అవసరమైతే కఠిన నిబంధనలు అమలు చేయాలంది. ఒమిక్రాన్ ముప్పు ముంచుకు రాకముందే ఆంక్షల్ని అమల్లోకి తీసుకురావాలని, కనీసం 14 రోజులు ఆంక్షలు అమల్లో ఉండేలా చూడాలంది.

రానున్న పండుగల నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని, పండుగల వేళ ఒమిక్రాన్ కట్టడికి రాత్రి కర్ఫ్యూలు అమలు చేయాలని కేంద్రం నిర్దేశించింది. భారీ సభలు, సమూహాలు నియంత్రించాలని స్పష్టం చేసింది. బాధితుల శాంపిల్స్ ను ఆలస్యం చేయకుండా జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని సూచించింది. డెల్టా, ఒమిక్రాన్ కేసులపై తరచుగా పరిశీలన జరపాలని, పాజిటివిటీ, డబ్లింగ్ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలంది.