Garlic : రోజు వెల్లుల్లి తీసుకుంటే బరువు తగ్గవచ్చా?

మధుమేహ రోగులకు రక్తంలో చక్కెర, కొవ్వు పదార్థాలు, ట్రై-గ్లిజరైడ్ల స్థాయిలు అధికంగా ఉంటాయి. దీంతో రక్తం చిక్కగా మారుతుంది.

Garlic : రోజు వెల్లుల్లి తీసుకుంటే బరువు తగ్గవచ్చా?

Garlic (1)

Garlic : వెల్లుల్లిని వంటల్లో రుచి,సువాసన కోసం వేస్తూ ఉంటాం. వెల్లుల్లిలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి.  వెల్లుల్లిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. వెల్లుల్లి బరువు తగ్గించటానికి సహాయపడుతుందని మనలో చాలా మందికి తెలుసు. అయితే ఎలా ఉపయోగిస్తే బరువు తగ్గుతామనే విషయం మనలో చాలా మందికి తెలియదు. ఇంటి చిట్కాలలో భాగమైన వెల్లుల్లి… లోబీపీ, జలుబుతో బాధపడేవారికి ఉపశమనం కలిగిస్తుంది. దీనికి నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించే సామర్థ్యం కూడా ఉంది.

వెల్లుల్లిలో విటమిన్ బి 6, విటమిన్ సి , ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం, ప్రోటీన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి బరువు తగ్గించటంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి. ప్రతి రోజు కొన్ని వెల్లుల్లి రేకలను తింటే జిమ్ కి వెళ్లకుండానే బరువు సులువుగా తగ్గవచ్చు. వెల్లుల్లి జీర్ణాశయంలోని ఎంజైములను ఉత్తేజపరచడం వల్ల తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవ్వటమే కాకుండా ఎక్కువ కేలరీలు ఖర్చు అయ్యేలా చేస్తుంది.

వెల్లుల్లిలో విటమిన్ B6, విటమిన్ C, ఫైబర్, మాంగనీస్, కాల్షియం ఉంటాయి. ఇవి అధిక బరువును తగ్గించడంలో సాయపడతాయి. వెల్లుల్లిలో ఉండే ప్రత్యేకమైన గుణాలు మహిళలు బరువు తగ్గడానికి తోడ్పడుతున్నట్టు ది జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురించిన ఓ అధ్యయనం తెలిపింది. పరిశోధకులు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు.

జీర్ణమైన ఆహారంలోని కొవ్వును వెల్లుల్లి ప్రొసెస్‌ చేయడమే కాదు. అనవసరమైన కొవ్వును శరీరం నుంచి బయటకు పంపిచేయటంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. వెల్లుల్లిని తినడం వల్ల తొందరగా ఆకలి వేయదు. అంతేకాదు వెల్లుల్లి అడ్రినలైన్‌ని ఎక్కువ మొత్తంలో విడుదల చేయడం ద్వారా నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేసి శరీర జీవక్రియ బాగా జరిగేట్టు చేసి క్యాలరీలను కరిగించటంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది.

శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడానికి, జలుబు, ఫ్లూ వంటి వాటితో పోరాడటానికి సహాయపడుతుంది. రోజువారీ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడం ద్వారా శరీర శక్తి స్థాయులు పెరడగంతో పాటు జీవక్రియ రేటు కూడా మెరుగుపడుతుంది. వెల్లుల్లిలో అలిసిన్ ఉంటుంది. ఇది కొవ్వును వేగంగా కరిగించటానికి ఉపయోగపడుతుంది. వెల్లుల్లి రేకలను పై తొక్కలు తీసేసి పాన్ లో నూనె లేకుండా వేగించాలి. వీటిని ప్రతి రోజు ఉదయం పరగడుపున తినాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటూ చేస్తే ఆ మార్పు మీకు స్పష్టంగా కనపడుతుంది. అయితే రోజుకి రెండు లేదా మూడు వెల్లుల్లి రేకలను మాత్రమే తినాలి.

మధుమేహ రోగులకు రక్తంలో చక్కెర, కొవ్వు పదార్థాలు, ట్రై-గ్లిజరైడ్ల స్థాయిలు అధికంగా ఉంటాయి. దీంతో రక్తం చిక్కగా మారుతుంది. దీని నివారణకు రోజూ వెల్లుల్లి తీసుకుంటే వీటి స్థాయిలు తగ్గటంతోపాటు గుండెపోటు ముప్పు, మధుమేహ సంబంధిత వ్యాధులు పూర్తిగా తగ్గిపోతాయట.దీన్ని తీసుకుంటే జలుబు, ఫ్లూ, జ్వరం, అధిక రక్తపోటు, విస్తారిత ప్రోస్టేట్, మధుమేహం, ఆస్టియో ఆర్థరైటిస్, ప్రయాణాలలో కలిగే విరేచనాలు, ప్రీఎక్లిప్సియా, కరోనరీ ఆర్టేరీ డిసిజేస్, గుండెపోటు, ధమనుల గట్టిపడటం లాంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందట.

ఎక్కువగా తింటే సైడ్ ఎఫెక్ట్స్వచ్చే అవకాశం ఉంది. ప్రతి రోజు వెల్లుల్లిని ఇలా తీసుకోవటం వలన బరువు తగ్గటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కీళ్ల నొప్పులు, గుండె సమస్యలు, అల్జీమర్స్ వంటివి ఏమి రాకుండా ఉంటాయి.

అదే క్రమంలో వెల్లుల్లిలో సల్ఫర్ ఎక్కువగా ఉన్నందున చిన్న పిల్లలకు తాక్కువ మోతాదులో వాడాలి. ఎక్కువైతే గాబరా పడతారు వెల్లుల్లి గాటుగా ఉంటుంది.. కొత్నమందికి కడుపులో మంట పుడుతుంది. వెల్లుల్లి కొంతమందికి పడదు.. ఎలర్జీ వస్తుంది, దురదలు, తలనొప్పి, ఆయాసం వస్తాయి. వీళ్ళు వెల్లుల్లి తినరాదు. ఆస్తమా ఉన్నవారు వెల్లుల్లి అస్సలు వాడకూడదు.