ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన..ఆరు నెలల కాలంలో ఆదాయం రూ. 69 వేలు అయితే…రూ. 30 వేల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. రూ. 2 లక్షల 24 వేల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టారని గుర్తు చేశారాయన. అప్పులు చేసి..నవరత్నాలు చేస్తుంటే..ఏపీ..ఫిజికల్ వ్యవస్థ ఎలా నిలబడుతుందని సూటిగా ప్రశ్నించారు ఎంపీ సుజనా. ఆదాయం..ఖర్చు కరెక్టుగా బ్యాలెన్స్ ఎలా చేస్తారో అర్థం కావడం లేదన్నారు. వైసీపీ ఆరు నెలల పాలనపై బీజేపీ 2019, నవంబర్ 29వ తేదీ శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఎంపీ సుజనా మాట్లాడుతూ…
> ఆరు నెలల కాలంలో రాజకీయాలు, వ్యక్తిగత దూషణలు చేయడంతో సరిపోయిందని విమర్శించారు. అమరావతి పనులను ఆరు నెలలు ఆపి..మరలా మొదలు పెట్టాలని చెప్పినట్లు తెలుస్తోందని, ఇందులో అవతవకలు జరిగితే..కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్య ధోరణితో చేయడం సరికాదన్నారు.
> పారిశ్రామిక వేత్తలు వచ్చి..కంపెనీలు పెట్టకపోతే..యువతకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. విజన్ స్టేట్ మెంట్స్‌తో బాబు..ఐదు సంవత్సరాలు గడిపేశారన్న ఆయన..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సపోర్టుతో వచ్చిన కంపెనీలు పారిపోయారని..దీనిపై సమాధానం చెప్పాలని సూచించారు.
> ఇసుకపై కొత్త పాలసీ ఎందుకు తీసుకొచ్చారో తెలియడం లేదని, పాత పాలసీ లాస్ట్ వరకు ఉంచి..కొత్తది తీసుకొస్తారని తెలిపారు. కానీ మధ్యలోనే ఆపేసి..రియల్ ఎస్టేట్ వ్యాపార స్తబ్దుగా అయ్యే విధంగా చేశారన్నారు.
> రివర్స్ టెండరింగ్ అన్ని చేస్తున్నామని చెప్పినా..ఏవీ మొదలు కాలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో జలశక్తి మంత్రి నుంచి అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదని..నిధులు ఇవ్వమంటే..ఎలా అని నిలదీశారు.
> ఇంగ్లీషు మీడియం అవసరమే..కానీ సరైన స్ట్రక్చర్ క్రియేట్ చేయకుండా నిర్భందంగా పెట్టడం సమంజసం కాదన్నారు.
> 2019 – 20 బడ్జెట్‌లో క్లియర్ కట్‌గా పెట్టిన డబ్బు ఎందుకివ్వడం లేదు…బాబు హయాంలో అప్పులు పెంచుకుంటూ పోయారని ఎంపీ సుజనా విమర్శించారు.
ఏపీ ఆరు నెలల పాలనపై బీజేపీ చేసిన విమర్శలపై వౌసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Read More : నవరత్నాల అమలుకు రాష్ట్ర స్థాయి కమిటీ