AP : స్కూళ్లు ప్రారంభం, పిల్లల ఆరోగ్యమే ముఖ్యం..మార్గదర్శకాలివే

2021, ఆగస్టు 16వ తేదీ సోమవారం నుంచి కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ స్కూళ్లు తెరవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

AP : స్కూళ్లు ప్రారంభం, పిల్లల ఆరోగ్యమే ముఖ్యం..మార్గదర్శకాలివే

Ap Corona Schools

Updated On : August 15, 2021 / 11:35 AM IST

AP Schools Reopen : ఏపీలో పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. 2021, ఆగస్టు 16వ తేదీ సోమవారం నుంచి కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ స్కూళ్లు తెరవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 61 వేల ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెట్‌ పాఠశాలల్లో 70 లక్షల మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. కరోనా వ్యాప్తి కారణంగా విద్యాలయాలు ప్రత్యేక జాగ్రత్తలతో తెరచుకోనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.

Read More : Big Boss 5: ఈసీజన్ టైటిల్ విన్నర్‌గా లేడీ కంటెస్టెంట్‌కు అవకాశం?

10 శాతం కన్నా తక్కువ పాజిటివిటీ రేటు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే స్కూళ్లు తెరవాల్సి ఉంటుంది. వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది ప్రతి వారం కోవిడ్ కేసులను గుర్తించాలి. ప్రతివారం..ప్రతి స్కూలులో ఇద్దరు విద్యార్థులు, సిబ్బంది నుంచి ఒకరికి ర్యాండమ్ టెస్టులు చేయాల్సి ఉంటుంది. ఎవరికైనా పాజిటివ్ అని తేలితే అందరికీ పరీక్షలు నిర్వహించాలి. పెన్సిళ్లు, పెన్నులు, పుస్తకాలు, వాటర్ బాటిళ్లు, ఇతరత్రా ఒకరి నుంచి మరొకరికి ఇవ్వకూడదు. తరగతి గదుల్లో 6 అడుగుల భౌతికదూరం ఉండేలా సీటింగ్ ఏర్పాట్లు చేయాలి. తరగతి గదులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలి. రోగ గ్రస్తులుగా ఉన్న వారినికి స్కూళ్లకు పంపించరాదు.

Read More : Covid-19 : దేశంలో పెరిగిన రికవరీ రేటు.. 36 వేల కేసులు.. 38 వేల రికవరీలు

రెగ్యులర్ సమయం ప్రకారమే తరగతులు నిర్వహించాలి. శానిటైజర్ ఏర్పాటు చేసి తరచూ చేతులు శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. తరగతి గదుల్లో ఆరడగుల భౌతిక దూరం తప్పనిసరి. స్కూలు అసెంబ్లీ, గ్రూప్ వర్క్ లు, గేమ్స్ వంటివి నిషేధం. స్కూలు బస్సులు లేని పిల్లలను వారి తల్లిదండ్రులే స్కూలు వద్ద దింపాలి. మిగిలిపోయిన టీచర్లందరికీ వ్యాక్సిన్ వేయాలి. పోర్టబుల్ థర్మల్ స్కానర్ ను స్కూల్ ఎంట్రీ గేట్ వద్ద ఏర్పాటు చేయాలి. విద్యార్థులందరినీ పరీక్షించాలి. మధ్యాహ్న భోజన పదార్థాలను వేర్వేరు సమయాలు కేటాయించి..వేర్వేరు తరగతుల విద్యార్థులకు పంపిణీ చేయాలి.

Read More : India VS England : రూట్‌ ఆటే హైలెట్‌

ప్రతి సెక్షన్‌కు 20 మంది విద్యార్థులు మించకుండా తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం తెలిపింది. అలాగే ప్రతి విద్యార్థి మాస్క్‌ ధరించడం, శానిటైజ్‌ చేసుకోవడం తప్పనిసరిగా పేర్కొంది. అటు ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఎప్పటికప్పుడు కోవిడ్‌ టెస్ట్‌లు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇప్పటికే టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌కు యుద్ధప్రాతిపదికన వ్యాక్సిన్లు వేయించే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.