Kakinada kaja : కాకినాడ కాజాకు..మాడుగుల హల్వాకు అరుదైన గుర్తింపు…

ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ఆదరణ కలిగిన ‘‘కాకినాడ కాజా’’కు అరుదైన గుర్తింపు లభించింది.కాకినాడ కాజాతో పాటు మాడుగుల హల్వాకు కూడా చక్కటి గుర్తింపు లభించింది.

Special Postal Covers Released On Kakinada Kaja

special postal covers released on Kakinada kaja : దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ఆదరణ కలిగిన ‘‘కాకినాడ కాజా’’కు అరుదైన గుర్తింపు లభించింది. 100ఏళ్లకుపైగా చరిత్ర కలిగిన ఈ కాకినాడ గొట్టం కాజాను నేటితరం కూడా గుర్తించేందుకు వీలుగా ప్రత్యేక పోస్టల్ స్టాంపు ను భారత తపాలా శాఖ విడుదల చేసింది. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ కాజా అంటే పాకం కారుతు కాజాను తింటుంటే మరొక కాజా తినకుండా ఉండలేరు. అంతటి రుచి దీని ప్రత్యేకత..1891లో తొలిసారిగా కాకినాడ కాజాను కోటయ్య అనే వ్యక్తి తొలిసారిగా ఈ కాజాను తయారు చేసి..దాన్ని రుచికి సుచికి చక్కటి గుర్తింపు కలిగేలా చేశారు. 2018లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ కాజాకు జియోగ్రాఫిక్‌ ఇండికేషన్‌ సౌకర్యం కల్పించి అంతర్జాయంగా మరింత ప్రచారం కలిగేలా చేసింది.

మరో విశేషం ఏమిటంటే..కాకినాడ కాజాతో పాటు మాడుగుల హల్వాకు కూడా చక్కటి గుర్తింపు లభించింది. మాడుగుల హల్వా విశిష్టతను కూడా పోస్టల్ కవర్ ద్వారా తపాల శాఖ వెలుగులోకి తీసుకొచ్చింది. విశాఖ జిల్లా మాడుగులలో 1890లో తొలిసారి తయారు చేసిన ఈ హల్వాకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది.గోధుమపాలు, నెయ్యి, బాదం పప్పు, జీడిపప్పు సమాహారంగా మాడుగుల వాసులు ఈ రుచికరమైన హల్వాను తయారు చేస్తున్నారు. ఈ హల్వా లైంగిక సామర్థ్యం పెంచే గుణం కూడా ఉన్నట్లు అంతర్జాతీయంగా ప్రచారం ఉంది.

మాడుగుల హల్వా తయారీ ప్రారంభమై దాదాపు ఒకటిన్నర శతాబ్దాలైనా దానికి క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఈ హల్వా కారణంగానే మాడుగుల ఓ పర్యాటక కేంద్రంగా మారిపోయింది.రాజకీయ నాయకుల నుంచి సినీ తారల వరకూ చాలా మంది ఈ హల్వాకు అభిమానులే అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. విశాఖ వచ్చిన చాలా మంది నేతి వాసనతో ఘుమఘుమలాడే మాడుగుల హల్వాను రుచి చూడకుండా వెళ్లరంటే దాని రుచి ఏంటో ఊహించుకోవచ్చు. మాడుగుల హల్వా అంటే చాలు నోరు ఊరిపోయేంత పేరు తెచ్చుకుంది.

విశాఖ జిల్లా మాడుగుల ప్రాంతం పేరుతోనే ఆ హల్వాకు మాడుగుల హల్వా అని గుర్తింపు వచ్చింది. 1890లో ఒక సామాన్య మిఠాయి వ్యాపారి దీనిని తయారు చేశారు. ఇప్పుడు మాడుగుల నుంచి 20కి పైగా దేశాలకు ఈ హల్వా ఎగుమతి అవుతోంది.

మాడుగుల గ్రామానికి చెందిన దంగేటి ధర్మారావు 140 ఏళ్ల కిందట అదే గ్రామంలో కుటుంబ పోషణకు మిఠాయి వ్యాపారం ప్రారంభించి బూడిద గుమ్మడి, కొబ్బరికాయ, ఖర్బూజాలతో హల్వా తయారు చేసి అమ్మేవారు. హల్వా వ్యాపారంలో బాగా పోటీ ఉండటంతో మరో కొత్త స్వీట్‌ని తయారు చేయాలనే ఆలోచన ఆయనకు వచ్చింది. ఆ కొత్త స్వీటే… ఇప్పుడు అందరూ లొట్టలు వేసుకుంటూ తింటున్న మాడుగుల హల్వా.