మందుకు డబ్బుల్లేవ్..షేవింగ్ లోషన్ తాగేసిన మందుబాబు..కుటుంబంలో విషాదం

  • Publish Date - December 8, 2020 / 03:49 PM IST

AP ; vijayawada Man dies drinking shaving lotion : మద్యం తాగటానికి డబ్బుల్లేక ఓ మందుబాబు ఏకంగా షేవింగ్ లోషన్ తాగేశాడు. దీంతో ఆగమాగం అయిపోయాడు. చివరకు ప్రాణాలే కోల్పోయాడు. ఈ ఘటన ఏపీలోని విజయవాడలో జరిగింది. దీంతో మృతుడి కుటుంబం అంతా విషాదంలో మునిగిపోయింది.



వివరాల్లోకి వెళ్తే.. విజయవాడలోని సాయిరామ్ థియేటర్ సమీపంలోని పోతన భవనంలో యలమంచిలి లక్ష్మణ్‌, నాగమణి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. లక్ష్మణ్ సాయిరామ్ థియేటర్ సమీపంలోని ఓ సెలూన్లో పనిచేస్తుండేవాడు.



మద్యం తాగండే లక్ష్మణ్ ఒక్కరోజు కాదు కదా ఒక్క పూట కూడా ఉండలేదు. తాగటం తూగటం అతని అలవాటు..మద్యానికి బానిసై ఆరోగ్యం పాడైనా అదేమీ లెక్కచేయడు..చుక్క పడాల్సిందే..కిక్కు ఎక్కాల్సిందేనంటాడు.



ఈ క్రమంలో గత శనివారం (డిసెంబర్ 5,2020) షాపుకు వెళ్లాడు. మందుబాటిల్ అడిగాడు.దానికి షాపు వారు డబ్బులివ్వు..లేదంటే ఇచ్చేది లేదని తేల్చి చెప్పేశారు. బాబ్బాబు డబ్బులు తరువాత ఇస్తాను..ఈరోజుకు ఓ బాటిల్ ఇవ్వు అని వేడుకున్నాడు. కానీ షాపువారు ఇవ్వలేదు. దీంతో మద్యం తాగాలనే కోరిక ఆపుకోలేక..అక్కడే ఉన్న షేవింగ్ లోషనే తాగాడు.



తాగిన వెంటనే బాగానే ఉన్న లక్ష్మణ్… సాయంత్రానికి అస్వస్థతకు గురయ్యాడు. ఛాతీలో నొప్పి, వాంతులు, కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లక్ష్మణ్ మృతి చెందారు. భార్య నాగమణి ఫిర్యాదుతో చిట్టినగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.