పని చేయరు గానీ, డాన్సులు మాత్రం చేస్తారు.. మంత్రి అంబటిపై వైఎస్ షర్మిల సెటైర్లు

సంక్రాంతికి ఉత్సాహంగా డాన్సులు చేసిన ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై పీపీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సెటైర్లు చేశారు.

apcc chief ys sharmil satire on minister ambati rambabu dance

YS Sharmila: మంత్రి అంబటి రాంబాబుపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంత్రి సంక్రాంతి డ్యాన్సులు చేస్తారు తప్పా, పని చేయరు అంటూ వ్యాఖ్యనించారు. ప్రకాశం జిల్లాలో శనివారం గుండ్లకమ్మ ప్రాజెక్ట్ ను షర్మిల పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోతుంటే సంబంధిత శాఖ మంత్రి మాత్రం సంక్రాంతి డ్యాన్సులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ కు మరమతులు చేయించడానికి జగనన్నకు మనసు రావడం లేదని ఆరోపించారు.

”వైఎస్ఆర్ చేపట్టిన అద్భుతమైన ప్రాజెక్టు గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్ట్. 16 నెల క్రితం ప్రాజెక్టు ఒక గేటు కొట్టకపోగా, 3 నెలల క్రితం మరో గేటు కొట్టుకుపోయింది. ఈ ప్రాజెక్టులోకి నీరు అందిస్తే 12 మండలాలకు సాగునీరు తాగునీరు అందిస్తుంది. జలయజ్ఞంలో అవినీతి చోటు చేసుకోబట్టే ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపించి గేట్లు కొట్టుకుపోయాయని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. రాజశేఖర్ రెడ్డి నిర్మించడం వల్లే చుట్టుపక్క ప్రజలు ఆయన దేవుడిగా కొలుస్తున్నారు. అలాంటి ప్రాజెక్టుకు వైసీపీ, టీడీపీ ప్రభుత్వాలు ఏం చేశాయనేది సమాధానం చెప్పాలి. వైసీపీ, టీడీపీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్లే గేట్లు కొట్టుకోవడానికి కారణమయాయి. ప్రాజెక్టు మెయింటెనెన్స్ కు నిధులు కేటాయించకుండా టీడీపీ ప్రభుత్వం.. రాజశేఖరరెడ్డిపై నిందలు వేయడం అమానుషం.

ప్రాజెక్టు మెయింటెనెన్స్ కి నిధులు కేటాయించలేని వైసీపీ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను ఏవిధంగా నెరవేరుస్తుందో సమాధానం చెప్పాలి. సంబంధిత మంత్రి అంబటి రాంబాబు సంక్రాంతికి డాన్సులు చేస్తారట గానీ, ప్రాజెక్టు పనులు మాత్రం పట్టించుకోడట. ఏమాత్రం మెయింటెనెన్స్ చేసి ఉన్న ఈ ప్రాజెక్టుకు ఇంత నష్టం జరిగి ఉండేది కాదు. ఒంగోలు ప్రజలకు ప్రతిరోజు నీరు ఇస్తామన్న ఇక్కడి నాయకుడు బాలినేని మాటలు నీటి రాతలుగా మారాయి తప్పితే ఆచరణ సాధ్యం కాలేదు. ఈ పాపం సీఎం జగన్మోహన్ రెడ్డిదే. ప్రాజెక్టు మరమ్మతులు కూడా చేయలేని మీరు వైఎస్సార్ వారసులు ఎలా అవుతారు? ఆయన ఆశయాలను ఎలా సాధిస్తారు? ఇప్పటికైనా మరమ్మతులు చేయకపోతే మొత్తం కూలిపోయే అవకాశం ఉందని స్థానిక ఇరిగేషన్ అధికారులు చెపుతున్నారు.

Also Read: నెల్లూరు వైసీపీలో కాక.. మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌కు షాక్!

ఈ ప్రాజెక్టులో నీళ్లు రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయామని స్థానిక రైతులు వాపోతున్నారు. మమ్మల్ని విమర్శించడం కాదు సీఎం జగన్ పనితీరు ఏంటో కొట్టుకుపోయిన గేటే సమాధానం చెబుతుంది. వెలుగొండ ప్రాజెక్ట్ విషయంలో ఈ ప్రభుత్వం తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయకవడం వల్లే నేటికీ ప్రాజెక్టు పూర్తి కాలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతుంది. టీడీపీ, వైసీపీకి అవకాశం ఇచ్చారు.. కాంగ్రెస్ కూడా ఒక అవకాశం ఇచ్చి చూడండి. విభజన హామీల మొత్తాన్ని నెరవేరుస్తామ”ని షర్మిల అన్నారు.