Sake Sailajanath
Sake Sailajanath : ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పర్యటించారు. మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా శవాల మీద రాజకీయాలు చేయదని అన్నారు. అలాంటి అలవాటు అధికారపక్షానికి ఉందని విమర్శించారు. ఎక్కడైనా అధిక సంఖ్యలో మరణాలు జరిగితే దానిపై స్పందించి ప్రభుత్వమే విచారణ చేపట్టి నిజాలను బయటకు తీసుకురావాలన్నారు.(Sake Sailajanath)
జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో నాటుసారా, కల్తీసారా ఏరులై పారుతోందని ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఎక్సైజ్ అధికారులు కూడా ఎన్నో కేసులు నమోదు చేశారని శైలజానాథ్ తెలిపారు. ఎక్సైజ్ అధికారులు కేసులు నమోదు చేసినట్లు అయితే వాటిపై న్యాయ విచారణ జరిపించాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. ఈ మరణాలపై కాంగ్రెస్ పార్టీ కూడా విచారణ కోరుతోందన్నారు.(Sake Sailajanath)
అధికార పార్టీ నాయకులు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, అసెంబ్లీని కూడా అబద్ధాలకు వేదికగా మార్చడం అనేది చాలా బాధ కలిగిస్తోందన్నారు. అసెంబ్లీ గౌరవాన్ని రోజు రోజుకి దిగజారుస్తున్నారని ఆయన వాపోయారు. విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ లో మృతి చెందిన ఒక కుటుంబానికి ఏపీ ప్రభుత్వం కోటి రూపాయలు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. అదే విధంగా జంగారెడ్డిగూడెంలో మృతి చెందిన ఒక కుటుంబానికి రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మద్యం అక్రమ రవాణ, సారా సేవించడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పారాయన.
Series Of Deaths : జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలపై కదిలిన ఎక్సైజ్ అండ్ ఎస్‌ఈబీ
జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. అధికార వైసీపీ, విపక్ష టీడీపీల మధ్య కొన్ని రోజులుగా మాటల యుద్ధం జరుగుతోంది. ఈ మరణాల అంశం అసెంబ్లీని కూడా కుదిపేస్తోంది. వారంతా కల్తీ సారా తాగి చనిపోయారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అంటోంది. కాగా, టీడీపీ ఆరోపణల్లో వాస్తవం లేదని వైసీపీ అంటోంది. అవన్నీ సహజ మరణాలే అని ఎదురుదాడికి దిగింది.
జంగారెడ్డిగూడెంలో నాటుసారా తాగి మరణించారన్న ఆరోపణలపై సీఎం జగన్ అసెంబ్లీలో స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు తగ్గించామని.. చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్న రేట్లతోనే విక్రయిస్తున్నప్పుడు కల్తీ మద్యానికి ఆస్కారం ఎక్కడిదంటూ ఆయన ప్రశ్నించారు. సహజ మరణాలను కూడా వక్రీకరిస్తూ ప్రతిపక్ష టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందంటూ విమర్శించారు.
కల్తీ మద్యందారులను ప్రోత్సహించింది చంద్రబాబేనని.. గత ప్రభుత్వం హయాంలో అక్రమ మద్యం తయారీ చేశారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ మద్యం రవాణ, నాటుసారాను కంట్రోల్ చేసేందుకే స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోని ఏర్పాటు చేసి ఉక్కుపాదం మోపామమని జగన్ స్పష్టం చేశారు.
AP Assembly : జగన్ ఫైర్ కాదు..ప్లవర్.. టీడీపీ ఎమ్మెల్యేల విమర్శలు
జంగారెడ్డిగూడెం మరణాల అంశంపై ఏపీ అసెంబ్లీ దద్దరిల్లుతోంది. జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకున్న మరణాలకు కల్తీ మద్యమే కారణమని ఆరోపిస్తూ దీనిపై ప్రత్యేక చర్చ చేపట్టాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. కల్తీసారా మరణాలను ప్రభుత్వం సహజ మరణాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని… 26 మంది చనిపోతే ప్రభుత్వంలో కనీస చలనం లేదని టీడీపీ నాయకులు మండిపడ్డారు. జంగారెడ్డిగూడెం మరణాలపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలన్నారు. మరణాలను తేలిగ్గా తీసుకుంటున్నారని… సభలో చర్చకు అంగీకరించే వరకూ పోరాటం ఆగదని టీడీపీ సభ్యులు తేల్చి చెప్పారు.